BigTV English

POCO M6 5G Discount Offer: 5జీ ఫోన్‌పై దుమ్మురేపే డిస్కౌంట్.. ఇప్పుడు రూ.8000 కంటే తక్కువకే కొనేయొచ్చు..

POCO M6 5G Discount Offer: 5జీ ఫోన్‌పై దుమ్మురేపే డిస్కౌంట్.. ఇప్పుడు రూ.8000 కంటే తక్కువకే కొనేయొచ్చు..

POCO M6 5G Discount Offer On Flipkart: POCO కంపెనీ ఫోన్లకు దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అదీగాక ఇప్పుడు లాంచ్ అవుతున్న 5జీ ఫోన్లన్నీ అధిక ధరలను కలిగి ఉంటే పోకో మాత్రం వాటికి భిన్నంగా లాంచ్ చేస్తుంది. సామాన్యులకు, మధ్య తరగతి వారికి అందుబాటు ధరలలో కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల తన చౌక స్మార్ట్‌ఫోన్ POCO M6 5Gని మరో కొత్త వేరియంట్‌లో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.


ఈ కొత్త వేరియంట్ కంటే ముందుగా మూడు వేరియంట్లతో కంపెనీ POCO M6 5Gని లాంచ్ చేసింది. అవి 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 256GB వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కంపెనీ 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను చౌక ధరలో మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ కొత్త వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతున్న గోట్ సేల్‌లో మరింత తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లవచ్చు.

POCO M6 5G Offers


Also Read: బెస్ట్ కెమెరా ఫోన్‌ కోసం చూస్తున్నారా.. వీటిని వదలకండి..!

POCO M6 5G స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ 4GB + 64GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 ఉండగా ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్‌తో రూ. 8,999కి లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ, పొలారిస్ గ్రీన్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్‌తో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.750 తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా రూ. 1,500 వరకు తగ్గింపును పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువకే కొనుక్కోవచ్చు.

POCO M6 5G Specifications

POCO M6 5G ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6100+ చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది Android 13లో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో గరిష్టంగా 256GB స్టోరేజ్ ఉంటుంది. POCO M6 5G ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్ ప్రాధమిక సెన్సార్ 50MP, ఇది AI మద్దతుతో వస్తుంది. అంటే ఈ చౌక స్మార్ట్‌ఫోన్‌లో కూడా వినియోగదారులు అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభూతిని పొందుతారు. అలాగే ఫోన్‌లో 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. అదే సమయంలో ఇది పవర్ బ్యాకప్ కోసం 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Blind Man AI Glasses: ఏఐ గ్లాసెస్‌తో కంటి చూపు లేని వ్యక్తికి ఉద్యోగం.. అదెలాగంటే?

Big Stories

×