BigTv Kissik Talks Show With Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోవే పోరా షోతో పాపులర్ అయిన విష్ణు.. ప్రస్తుతం సినిమాలు, ఆడపదడపా షోలు చేస్తూ వస్తోంది. అయితే కొంతకాలంగా యాంకరింగ్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టాప్ యాంకర్లో ఒకరైన విష్ణు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని, అసలు యాంకరింగ్ ఎందుకు వదిలేసిందని ఎన్నో సందేహాలు ఆమె ఫ్యాన్స్లో ఉన్నాయి. యాంకరింగ్ చేస్తుండగానే ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొందని, ఈ రాజకీయాల మధ్య ఉండలేక విష్ణు యాంకరింగ్ వదిలేసినట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ రూమర్స్పై విష్ణు ప్రియ స్పందించింది. బిగ్టీవీ కిస్సిక్ టాక్ షోకి అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంది. నిజానికి నేను యాంకర్ అవ్వాలనుకోలేదు. యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్న నాకు పోవే పోరా షో ఆఫర్ వచ్చింది. యాంకరింగ్ నేను దిక్కు లేక ఆ షో చేశాను. యూబ్యూట్ వీడియోలు చేసుకుంటున్న నాకు అంత డబ్బులు రావడం లేదు. అప్పుడే పోవే పోరా షో ఆఫర్ వచ్చింది. అది పెద్ద ఛానల్ కాదుగా.. నాకు ఫేం కూడా ఏదో కొన్ని రోజులు చేసుకుని మానేద్దామని అనుకున్నా. కానీ, షో మొదలైని నెల, రెండు నెలలకే నాకు మంచి గుర్తింపు వచ్చింది.
ఈ షోతో పాపులారిటి కూడా పెరిగింది. అది చూసి అక్కడ నా తోటి యాంకర్స్ నన్ను చూసి కుళ్లుకునేవారు. మేము సంవత్సరాలు సంవత్సరాలు ఉన్నా రానీ గుర్తింపు నాకు ప్రారంభంలో వచ్చిందని వాళ్లంత నా పట్ల జెలసీతో ఉండేవారు. కనీసం నాతో సరిగా మాట్లాడేవారు కూడా కాదు. ఒకవేళ సుధీర్ లేకపోతు పోవే పోరా షో అన్ని రోజులు చేసేదాన్ని కాదు. సుధీర్ లేకపోతే 50 ఎపిసోడ్లకే ఆ షో వదిలేదాన్ని. సుధీర్ వల్ల మూడేళ్లు ఆ షో చేయగలిగాను. అప్పుడే లాక్డౌన్ వచ్చింది. నాకు యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి బాగానే డబ్బులు వస్తున్నాయి.
ఇక యాంకరింగ్ కి బ్రేక్ తీసుకోవాలని అనిపించింది. పైగా ఆ షో చేయడం నాకు అసలు ఇష్టం లేదు. అదే ఫర్మాట్, అదే షో చేసి బోర్ కొట్టింది. మళ్లీ మూడేళ్లు అయిన వాళ్లు రెమ్యునరేషన్ పెంచలేదు. అందుకే ఇక బ్రేక్ తీసుకుందామని తీసుకున్నా. ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్, డ్యాన్స్ షోలపై ఫోకస్ పెట్టాను” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన పెళ్లిపై కూడా స్పందించింది. తనకు నచ్చిన అబ్బాయి దొరకపోతే అసలు పెళ్లి చేసుకోవనని చెప్పింది. ప్రస్తుతం పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాని, అతి త్వరలోనే జరగాలని కోరుకుంటున్న అని చెప్పింది. ఒకవేళ కాకపోతే సన్యాసం తీసుకుని కాశీ, హిమలయాలకు వెళ్లిపోతానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.