Vishnu Priya About First Remuneration: తెలుగు స్టార్ యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. పోవే పోరా షోతో బాగా పాపులర్ అయ్యింది. ఇందులో సుడిగాలి సుధీర్తో కలిసి షోకి హోస్ట్గా వ్యవహరించింది. ఇందులో వారు యాంకరింగ్తో కంటే ఒకరితో ఒకరు గొడవలు పడుతు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునేవారు. దీంతో అతి తక్కువ టైంలో పోవే పోరా మంచి హిట్ అయ్యింది. యాంకర్స్గా సుధీర్, విష్ణు ప్రియలకు మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే విష్ణు ప్రియ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం యాంకరింగ్కి గుడ్ బై చెప్పి.. సినిమాలు, ప్రైవేట్ అల్భమ్ సాంగ్స్ చేస్తుంది.
ఈ క్రమంలో ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా వచ్చింది. గత సీజన్లో ఆమె సందడి చేసింది. తనదైన ఆటతో టాస్క్ల్లో రాణిస్తూ హౌజ్లో ఎక్కువ రోజులు కొనసాగింది. బిగ్ బాస్ తర్వాత విష్ణు ప్రియపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాను భారీ ఆస్తులు కొన్నదని, రెండు ఫ్లాట్స్, కార్లు కొన్నదంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ ఈ రూమర్స్పై స్పందించింది. తనకు డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేస్తానంది. పేమెంట్ కొంచం లేటు అయితే పూర్ కిడ్ని అంటూ ఈ రూమర్స్ ని సున్నితంగా కొట్టిపారేసింది. ఇప్పటికీ పాతబడ్డ ఇంట్లోనే ఉంటునాని, టైల్స్ ఊడిపోయాయని, దాన్ని రెనోవేట్ చేసుకోవడానికి డబ్బుల్లేవు అని చెపుకొచ్చింది. కాగా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది.
ఇటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బాగానే కూడబెట్టుకున్న విష్ణు ప్రియ తన తొలి రెమ్యునరేషన్ ఎంతో కూడా చెప్పింది. అలాగే బెట్టింగ్ యాప్ వివాదంపై కూడా స్పందించింది. తాను అవి గౌరవర్నమెంట్ ఆధారిటీతో రన్ చేస్తున్నారనుకున్నాను. క్రికెటర్స్, సెలబ్రీటలు కూడా ప్రమోట్ చేయడంతో ప్రభుత్వం ఆమోదం ఉందనుకున్నాను. కానీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు చాలా మంది నన్ను తిట్టుకుని ఉంటారు. కానీ, నాక ఆ విషయం తెలియదు. తర్వాతే తెలిసిందే. అవి ప్రమోట్ చేసినందుకు చాలా ఫీల్ అయ్యానని చెప్పింది. ఇండస్ట్రీ రాకముందు యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌ల్లో నటించిన సంగతి తెలిసిందే. తను చిన్నప్పటి నుంచే సంపాదించడం మొదలు పట్టానంది.
ఓ కార్యక్రమంలో అమ్మవారి ఛాంటింగ్ చదివినందుకు తనకు రూ. 500 ఇచ్చారని చెప్పింది. అలాగే పెయింటింగ్స్, డ్రాయింగ్ కాంపిటేషన్‌లో ద్వారా రూ. 500 నుంచి రూ.1000 వరకు వచ్చేదని చెప్పింది. తన ఫస్ట్ మూవీకి రూ. 30 వేల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు చెప్పింది. తొలి సినిమా తర్వాత ఇక నటనకు బ్రేక్ చెప్పి తన బాయ్ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని సెటిలైపోవాలనుకుందట. అతడు కూడా ఇండస్ట్రీ వ్యక్తి అవ్వడంతో తనకు కూడా నటనపై ఆసక్తి కలిగిందని, అలా ఫన్ బకెట్ వీడియో చేసినట్టు చెప్పింది. అలా చేసినందుకు ఒక్క షోకి రూ. 500 ఇచ్చినట్టు చెప్పింది. ప్రస్తుతం షోలో తన పర్ఫామెన్స్, ఆఫర్ని బట్టి వేలల్లో, లక్షల్లో పారితోషికం అందుకున్నట్టు విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆస్తులంటు తనకు పెద్దగా లేవని, బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ఫిక్డ్స్ డిపాజిట్ చేశానని, ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఆస్తి అదేనని తెలిపింది.