BigTV English
Advertisement

OTT Movie : లేడీ సూపర్ హీరోకు ఓటీటీ చిక్కులు… హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టిన ‘లోకా చాప్టర్ 1’

OTT Movie : లేడీ సూపర్ హీరోకు ఓటీటీ చిక్కులు… హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టిన ‘లోకా చాప్టర్ 1’

OTT Movie : థియేటర్లలోకి వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ సినిమా ‘లోకా చాప్టర్ 1-చంద్ర’ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ డొమినిక్ అరుణ్, ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్ రూపొందించిన ఈ సినిమా, 2025 ఆగస్టు 28న విడుదలై దాదాపు 300 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి మలయాళం సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. నెటిజన్లు ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు, ఆన్‌లైన్‌లో విడుదలైన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జేక్స్ బెజోయ్ సంగీతం, చమన్ చాకో ఎడిటింగ్‌ను ప్రశంసించారు. అలాగే కొన్ని వివాదాలు కూడా వస్తున్నాయి. ఈ వివాదాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి.


1. బెంగళూరు వివాదం

ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ డైలాగ్‌లో బెంగళూరు మహిళల గురించి అవమానకరమైన కామెంట్ చేసినట్లు ఉంది. ఇది కర్ణాటక మహిళలను డీమీన్ తో పోల్చినట్లు ఉందని వాపోతున్నారు. అలాగే బెంగళూరును, పార్టీలు, డ్రగ్స్ హబ్ గా చూపించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కన్నడ డైరెక్టర్ మన్‌సూర్ (బీమా ఫేమ్) మలయాళ సినిమాలు, బెంగళూరును డ్రగ్స్ & క్రైమ్ క్యాపిటల్‌గా చూపుతున్నాయని ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశాడు. ఇది సోషల్ మీడియాలోవైరల్ కావడంతో కర్ణాటక పోలీస్ లు లా వయొలేషన్ ఉంటే యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ వే ఫేర్ ఫిల్మ్స్ అధికారిక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ఈ సినిమాలో ఒక డైలాగ్ కర్ణాటక ప్రజల సెంటిమెంట్స్‌ను హర్ట్ చేసినట్లు తెలిసిందని, ఎవరినైనా హార్ట్ చేసుంటే మేము సారీ చెబుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ డైలాగ్‌ను ఎడిట్ చేసి తీసివేస్తాం అనడంతో ఆ వివాదం కొంత సర్దుమనిగింది.

Read Also :  అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక


2. హిందూ వివాదం

ఈ సినిమాలో ఒక సీన్‌లో హిందూ రాజు ఒక టెంపుల్‌ను బర్న్ చేస్తున్నట్లు చూపించారని, క్రిస్టియన్ మిషనరీలు, కన్వర్ట్‌లను సేవియర్స్ గా పోర్ట్రే చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇవి హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఈ సినిమాకి డైరెక్టర్ క్రిస్టియన్, ప్రొడ్యూసర్ ముస్లిం కాబట్టి ఇలా చేశారని టార్గెట్ చేస్తున్నారు. అయితే కర్ణాటక వివాదంపై మాత్రమే అపాలజీ ఇచ్చారు కానీ హిందూ సెంటిమెంట్స్ మీద ఇంకా రియాక్ట్ కాలేదు. అయితే కొందరు సోషల్ మీడియా వేదికగా అపాలజీ కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చాలా మంది నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

 

Related News

OTT Movie : చిన్నపిల్లను ఎత్తుకెళ్లే మిస్టీరియస్ జీవి… ఏలియన్, దెయ్యాలు, మంతగత్తెలు అన్నీ ఈ ఒక్క సిరీస్ లోనే

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 852 కోట్ల బ్లాక్ బస్టర్… నార్త్ ఆడియన్స్ కే ఎందుకు అందుబాటులో లేదంటే ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్…. ఓటీటీలో తుక్కురేగ్గొడుతున్న ధనుష్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

Big Stories

×