Samatha College: విశాఖలోని సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళాశాల గేటు పగలగొట్టేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. సమతా కళాశాల వద్ద భారీగా పోలీసులు చేరుకున్నారు. విద్యార్థి సాయితేజకు జిల్లా కలెక్టర్ న్యాయం చేసే వరకు కాలేజీ వద్ద నుంచి కదిలేది లేదంటూ విద్యార్ధులు నిరసనలు చేపట్టారు. అదేవిధంగా సాయితేజ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విద్యార్థి సూసైడ్ కు మహిళ లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.