Vishnu Priya Comments on Bigg Boss : యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ షోని తిట్టాలనుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ గురించి, అందులో బాండింగ్స్పై పెదవి విప్పింది. బిగ్బాస్ 8లోకి విష్ణు ప్రియ కంటెస్టెంట్గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో తనదైన ఆటతో, సీరియల్తో పృథ్వీ శెట్టి లవ్ ట్రాక్‌తో మెప్పించింది. అంతేకాదు టాస్క్లోనూ శివంగిలా రెచ్చిపోతూ టఫ్ కాంపిటేషన్ ఇచ్చింది.
తనదైన ఆటతో ఆడియన్స్, బిగ్ బాస్ని మెప్పిస్తూ ఎక్కువ వారాలు హౌజ్లో ఉన్న విష్ణు మరోసారి బిగ్ బాస్ 9 నుంచి పిలుపు వస్తే వెళతావా? అని యాంకర్ ప్రశ్న ఇచ్చింది. దీనికి విష్ణు ప్రియ ఇచ్చిన రియాక్షన్ హాట్ టాపిక్‌గా మారింది. “బిగ్ బాస్ వల్ల నేను కొత్త ఏం నేర్చుకోలేదు. అప్పటికే నేను ఎన్నో తెలుసుకున్నా. బాబోయ్ మళ్లీ బిగ్ బాస్‌కి షోకి నా జీవితంలో వెళ్లను. వెళ్లిన కొన్ని రోజులకే ఈ షోకి ఎందుకు వచ్చానురా అని బాధపడ్డాను. బిగ్ బాస్ కి వెళ్లినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని అనిపించింది. నన్ను నేను తిట్టుకోని రోజు లేదు. ఇప్పటికే ఈ షోకి వెళ్లినందుకు చెప్పుతో కొట్టుకోవాలేదని బాధపడుతున్నాను. హౌజ్ నరకం చూశా. నాకు ఈ బిగ్ బాస్ షో పెద్ద పరీక్షలా అనిపించింది. బయట రెండు రోజులు వర్క్ చేస్తే.. మూడో రోజు హాయిగా రెస్ట్ తీసుకునేదాన్ని. బాడీ మసాజ్ చేసుకుంటు హాయిగా ఉండేదాన్ని. కానీ, బిగ్ బాస్ హౌజ్లో అసలు ఏం లేదు. సరైనా నిద్ర, తిండి లేదు. కనీసం నచ్చినప్పుడు టీ, కాఫీ తాగడానికి కూడా లేదు.
వెళ్లినప్పటి నుంచి ప్రతి క్షణం ఈ షోకి ఎందుకు వచ్చానురా అని అనుకోని రోజు లేదు. అందుకే షో నుంచి బయటకు వచ్చాక బిగ్ బాస్ని తిడదామనుకున్న. కానీ, ఈ షో వల్ల నాకు వచ్చిన దక్కిన ప్రేమ, ఫేంతో చూసి హౌజ్ లో కష్టపడినదానికి ఫలితం దక్కింది అని పించింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ వల్ల తనకి మంచి ఫ్రెండ్ (పృథ్వీ శెట్టి) దొరికాడని చెప్పింది. అంతేకాదు సీత, నిఖిల్, యష్మి, ప్రేరణ, నైనిక అందరు నాకు మంచి స్నేహితులయ్యారని చెప్పింది. ఇక నేను ఎలాంటి వరస్ట్ ఫేస్‌లో ఉన్న నాకు తొడు ఉండేది నా బెస్ట్ ఫ్రెండ్స్. వారంత నాకు కావాల్సినప్పుడు నాతో ఉంటారు. అందులో లక్ష్మి ఘట్టమనేని ఒకరు. నాకు బాధ అనిపిస్తే ఫస్ట్ ఫోన్ తనకే చేస్తాను.
కానీ, నాకు బాధ అనిపించినప్పుడు ఒకరితో మాట్లాడాలని అనుకోనేలోపే ఒకరి నుంచి తప్పకుండ ఫోన్ వస్తుంది. ఆయనే జేడీ చక్రవర్తి అంటూ చెప్పుకొచ్చింది. ఇక వాంటెడ్ పండుగాడు సినిమాలో అనుకోకుండ రాఘవేంద్ర గారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని చెప్పింది. ఆయన ఓ సినిమా చేస్తున్నారని, అందులో నేను ఒక హీరోయిన్ అని చెప్పారు. నేను నమ్మలేదు. రాఘవేంద్రగారి సినిమాలో నేను హీరోయిన్ ఏంటని నమ్మలేదు. ఫోన్ చేసిన వాళ్లనే ఏం మాట్లాడుతున్నారు.. మీరు నిజమే చెబుతున్నారా? అని అడిగా. అవును అది కామెడీ సినిమా అందులో నేను హీరోయిన్ అన్నారు. కామెడీ మూవీ అన్నారు కాబట్టి.. హీరోయిన్ అని నమ్మేశాను అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.