BigTV English
Advertisement

Yadadri Collector: ఇది కదా కలెక్టర్ అంటే.. ప్రజల సమస్య తెలిసిన వెంటనే పరిష్కారం.. జనాలు హర్షం వ్యక్తం

Yadadri Collector: ఇది కదా కలెక్టర్ అంటే.. ప్రజల సమస్య తెలిసిన వెంటనే పరిష్కారం.. జనాలు హర్షం వ్యక్తం

Yadadri Collector: ఐఏఎస్ అధికారి.. ఎంతో కష్టపడితే కానీ ఆ ఉద్యోగం రాదు.. దేశంలోనే అత్యున్నతమైన జాబ్ అది..  ఈ ఉద్యోగం సాధిస్తే.. 24 గంటలు ప్రజలకు సేవ చేయవచ్చు… కానీ ఈ రోజుల్లో ప్రజలకు మంచి పనులు చేసే ఐఏఎస్ ఆఫీసర్ అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నారు. నిజంగా గొప్ప సేవలు చేసిన అధికారులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చేసిన మంచి పనులకు గానూ ప్రజలు ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ప్రజల దీర్ఘకాలిక సమస్యకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు చొరవతో తక్షణ పరిష్కారం లభించింది. రవాణా సౌకర్యం లేక రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి పడుతున్న ఇబ్బందులను అక్కడి ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు ఇందిరానగర్ కాలనీలో తాత్కాలికంగా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు జరిగాయి.

తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులు..


మోత్కూరు ఆరో వార్డుకు చెందిన ఆరెగూడెం, ఇందిరానగర్ కాలనీలకు సంబంధించిన రేషన్ షాప్ నెంబర్ 4408002 ఆరెగూడెంలో ఉంది. ఇందిరానగర్ నుండి ఆరెగూడెంకు ప్రతినెల రేషన్ సరుకుల కోసం వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇందిరానగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ద్విచక్ర వాహనాలు లేని నిరుపేదల కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవి. ప్రతి నెలా బియ్యం, ఇతర సరుకులు మోసుకురావడానికి పడుతున్న అవస్థలను వారు జిల్లా కలెక్టర్  హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరానగర్ కాలనీలో కూడా రేషన్ సరుకులు పంపిణీ చేసేలా చూడాలని వేడుకున్నారు.

కలెక్టర్ ఆదేశాలు.. తక్షణమే స్పందన

ప్రజల కష్టాలను ఆలకించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు తక్షణమే స్పందించారు. ఇందిరానగర్ ప్రజల ప్రయాణ కష్టాలను దృష్టిలో ఉంచుకొని, అక్కడే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, రేషన్ డీలర్ లక్ష్మయ్య సహకారంతో ఇందిరానగర్ ఎస్సీ కమిటీ హాల్ బిల్డింగ్‌లో ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు.

కలెక్టర్ ఫోటోకు పాలాభిషేకం

కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇందిరానగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వారి ఆవేదనను ఆలకించి, తక్షణమే స్పందించి, సరుకులను తమ కాలనీలోనే అందుబాటులోకి తెచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు గారికి ప్రజలు తమ కృతజ్ఞతలను తెలియజేస్తూ పాలాభిషేకం చేశారు. ఈ చర్యతో వృద్ధులు, మహిళలు ఇకపై సరుకుల కోసం దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా పోయింది.

ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. బీఆర్ఎస్ గుండెల్లో గుబులు..!

Related News

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ రణరంగంలో గెలిచేది అతనే.. హీరో సుమన్ సంచలనం

kalvakuntla kavitha: కేటీఆర్, కేసీఆర్‌పై కుట్రలు.. బీఆర్ఎస్ నేత‌ల‌ గుట్టు విప్పుతున్న కవిత

CM Revanth: నవీన్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే.. రూ.వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

Weather News: మళ్లీ రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు.. ఉరుములు, మెరుపులతో..!

Jubilee Hills Bipole: బస్తిమే సవాల్.. జూబ్లీ గడ్డ.. ఎవరి అడ్డా?

Kalvakuntla Kavitha: నేను ఎవరి బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. బీఆర్ఎస్ గుండెల్లో గుబులు..!

Big Stories

×