Gold Silver Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గోల్డ్, సిల్వర్ దిగుమతులపై బేస్ రేటును తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ప్రభుత్వం బంగారం, వెండి బేస్ దిగుమతి ధరను తగ్గించింది. బంగారం దిగుమతి బేస్ ధరను 10 గ్రాములకు 42 డాలర్లు, వెండి కిలోగ్రాముకు 107 డాలర్లు తగ్గించింది కేంద్రం. ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ధరలను నియంత్రించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.
దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని లెక్కించడానికి బేస్ రేటును ఉపయోగిస్తారు. బేస్ రేటును ప్రతి 15 రోజులకు ఒకసారి అప్డేట్ చేస్తుంటారు. బేస్ ధరను తగ్గించంతో దిగుమతులపై పన్ను భారాన్ని తగ్గనుంది. దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.
బేస్ ధరల తగ్గింపుతో బంగారం దిగుమతులు చౌకగా మారనున్నాయి. దీంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. చైనా తర్వాత ప్రపంచంలో గోల్డ్ అధికంగా దిగుమతి చేసుకుంటున్న రెండో అతిపెద్ద దేశం భారత్. వెండి దిగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. భారత్ స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. భారత్ మొత్తం బంగారం దిగుమతుల్లో దాదాపు 40% స్విట్జర్లాండ్ వాటా కలిగి ఉంది. 16% వాటాతో యూఏఈ రెండో స్థానంలో, దాదాపు 10% వాటా దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో.. భారత్ 48 దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 2024-25లో గోల్డ్ ఇంపోర్ట్స్ 27.3% పెరిగి 58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నవంబర్ 1వ తేదీన 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరలు తగ్గాయి. 100 గ్రా. బంగారం ధర రూ.2,100 నుంచి రూ.2,800 వరకు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కి చేరుకుంది. 8 గ్రా. బంగారం ధర రూ.224 తగ్గి రూ.98,400కి చేరుకుంది. నేడు వెండి ధరలు పెరిగాయి. వెండి ధర కిలోకు రూ.1,000 పెరిగి రూ.1,52,000 వద్ద నిలిచింది.