Upasana -Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Moviee) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే షూటింగ్ పనులను శరవేగంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాంచరణ్ క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.. ఇకపోతే ఇటీవల తన ఫ్యామిలీలో వరుస వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఉపాసన (Upasana)సీమంతపు వేడుకలు జరగడంతో రామ్ చరణ్ ఈ వేడుకలలో పాల్గొన్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్ నిశ్చితార్థపు వేడుక కూడా జరిగింది.
ఇక ఈ కార్యక్రమంలో కూడా మెగా కపుల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అల్లు శిరీష్ నిశ్చితార్థపు వేడుకలలో భాగంగా ఉపాసన రాంచరణ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు .అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన ఉపాసన తను రామ్ చరణ్ ఎంతలా మిస్ అవుతుందో తెలియజేశారు. రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. చాలా రోజుల తర్వాత మిస్టర్ సీ తో కలిసి ఫోటో దిగే అవకాశం లభించింది.. థాంక్యూ సో మచ్ అంటూ రాంచరణ్ ని ఎంతలా మిస్ అవుతుందో తెలియజేశారు. ఉపాసనతో కలిసి ఫోటో దిగడానికి కూడా సమయం లేని విధంగా రాంచరణ్ తన పనులలో బిజీగా ఉన్నారని స్పష్టమవుతుంది.
ఇక అల్లు శిరీష్ నైనిక నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో ఆ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ అల్లు శిరీష్ నైనికకు ఉపాసన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. పాపం అన్న ఒక ఫోటో దిగొచ్చు కదా.. వదిన చెప్పినట్టు వినొచ్చు కదా అన్న అంటూ కామెంట్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతో క్యూట్ కపుల్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Finally got a picture after so long with the great Mr C 😆Thank you & Congratulations @AlluSirish & Nayanika ! ❤️
What a beautiful ceremony — wishing both of you the very best 🤍✨
Nirmala aunty special ❤️ to u 🥰 pic.twitter.com/wZtrSFHyMe— Upasana Konidela (@upasanakonidela) November 1, 2025
ఇక ఉపాసన విషయానికి వస్తే ఈమె బిజినెస్ ఉమెన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఉపవాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత మొదటిసారి అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ లో కనిపించడంతో ఉపాసనకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకు ఉపాసన రాంచరణ్ దంపతులకు క్లిన్ కారా జన్మించింది అయితే రెండోసారి మాత్రం ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని మెగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపాసన ఐదవ నెల ప్రెగ్నెన్సీ తో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఉపాసన సీమంతపు వేడుకలను మెగా కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read: Actor Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది… బైకర్ మూవీ ఈవెంట్‌లో బాంబ్ పేల్చిన రాజశేఖర్