హైదరబాద్ మెట్రో ఆపరేషనల్ టైమింగ్స్ మార్చుతూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మెట్రో రైళ్ల కోచ్ లు పెంచాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తుండగా, వాటిని పెంచకపోగా, ఇప్పుడు ఉన్న సమయాన్ని తగ్గించడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఆఫీసుల నుంచి రాత్రి 11.00 గంటల తర్వాతే బయటకు వస్తారు. ఇప్పటి వరకు చివరి రైళ్లు 11.45 వరకు నడవడంతో హ్యాపీగా వెళ్లేవారు. కానీ, రాత్రి 11 గంటల వరకే నడిపిస్తామని మెట్రో ప్రకటించడంతో చాలా మంది ఐటీ ఉద్యోగల ప్రయాణాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఆపరేషనల్ ఖర్చులు తగ్గించుకునేందుకు మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, చాలా మంది ప్రయాణీకుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది.
అటు వీకెండ్స్ లో చాలా మంది ఉద్యోగులు బయటకు వెళ్తారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేస్తారు. ఇన్నాళ్లు వాళ్లు కూడా మెట్రో రైళ్లను తమ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు. కానీ, తాజా నిర్ణయం వారి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా కోచ్ ల సంఖ్య పెంచాల్సిందిపోయి.. ఉన్న సమయాన్ని తగ్గించడం ఏంటని పలువు ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. “ ఇదేంటి??.. వీకెండ్ ప్రయాణీకులకు అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు బెస్ట్ ఆప్షన్. రాత్రి 11:00 గంటలకు కాదు, రాత్రి 11:45 గంటలకు బయలుదేరే చివరి రైళ్లకు అందరం అలవాటు పడ్డాము. ఫస్ట్ మీరు కోచ్ ల సంఖ్య పెంచాలి. కానీ, ఎప్పుడూ పెంచలేదు. ఇప్పుడు ఉన్న సమయాలను కూడా కూడా తగ్గిస్తున్నారా? నిజంగా సిగ్గు చేటు” అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “మెట్రో కోచ్ లను పెంచడంతో పాటు రద్దీ సమయంలో రైళ్ల ఫ్రీక్వెన్సీని 5 నిమిషాల నుంచి 3 నిమిషాలకు తగ్గించాలి” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
What is this??
Metros till late night were the best option for weekday travelers. We were all used to the last trains leaving at 11:45 PM, not 11:00 PM.
First, you guys never extended the number of coaches, and now you’re cutting down the timings too?Such a shame, @ltmhyd. 👎
— Saurabh Sarkar (@saurabhsarkarss) November 1, 2025
Please Increase coaches and Reduce frequency of trains from 5 mins to 3mins atleast Peack hours
— Kssr (@kssr55) November 1, 2025
తాజాగా హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్చుతున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. సవరించిన మెట్రో టైమింగ్స్ నవంబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం వారంలో మూడు రకాల టైమింగ్స్ ప్రకారం రైళ్లు నడుస్తుండగా, ఇకపై వారంలోని అన్ని రోజులు ఒకే టైమింగ్స్ ఫాలో కానున్నట్లు వెల్లడించింది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఒకేలా ఉంటాయని తెలిపింది. ఉదయం 6:00 నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమై, రాత్రి 11:00 గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది. ప్రయాణీకులు ఈ టైమింగ్స్ ప్రకారం తమ రాకపోకలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు రకాల టైమింగ్స్ ను ఫాలో అవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై.. చివరి రైలు రాత్రి 11:45 గంటల వరకు నడుస్తుంది. శనివారం నాడు మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు వరకు నడుస్తుంది. ఆదివారం నాడు మొదటి రైలు ఉదయం 7:00 గంటలకు ప్రారంభం కాగా, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు నడుస్తుంది. ఇకపై వారం రోజులు ఒకేలా టైమింగ్స్ ఉంటాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది.
Read Also: రైల్వే టికెట్లు బుక్ చెయ్యడం కష్టమే.. ఎప్పటి వరకు అంటే?