E-Paper
Advertisement

Poco M6 5G New Variant Launched: బడ్జెట్ కింగ్ లాంచ్.. అతి చౌక ధరలో పోకో 5జీ కొత్త వేరియంట్ వచ్చేసింది..!

Poco M6 5G New Variant Launched: బడ్జెట్ కింగ్ లాంచ్.. అతి చౌక ధరలో పోకో 5జీ కొత్త వేరియంట్ వచ్చేసింది..!

Poco M6 5G New Variant Launched with 50MP camera: స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ పోకో దేశీయ మార్కెట్‌లో తన హవా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో బాగంగానే కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా మోడళ్లను తీసుకొచ్చిన పోకో తాజాగా మరొక మోడళ్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. కంపెనీ Poco M6 5G మోడళ్‌లోని కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

ఈ ఫోన్ డిసెంబర్ 2023లో భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఆ సమయంలో ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్, 6GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు కంపెనీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో మరో కొత్త వేరియంట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్‌లోని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

కంపెనీ Poco M6 5Gలోని కొత్త వేరియంట్ 4GB RAM + 64 GB స్టోరేజ్‌ను తాజాగా పరిచయం చేసింది. అయితే విశేషమేంటంటే ఎయిర్‌టెల్ లాక్డ్ వెర్షన్ (వయా) కూడా ప్రారంభించబడింది. ఇది సాధారణ మోడల్ కంటే కొంచెం చౌకగా కొనుగోలు చేయవచ్చు. కొత్త ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ.8,249గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ సేల్ జూలై 20 నుంచి ప్రారంభం కానుంది. ఫోన్‌ను ఓరియన్ బ్లూ, పొలారిస్ గ్రీన్, గెలాక్టిక్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read:  ఒప్పో రెనో 12 ప్రో 5జీ సేల్ స్టార్ట్.. ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఇవే..!

Poco M6 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.74 అంగుళాల HD + డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌ని ఫోన్‌లో అందించారు. ఇందులో గరిష్టంగా 8 GB RAM + 256 GB స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజీని విస్తరించేందుకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా అందించబడుతుంది. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించారు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUI 14 పై రన్ అవుతుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది. Poco M6 5G వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది కాకుండా యాంబియంట్ లైట్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 5, రెండు SIMలు, 5G ​​కనెక్టివిటీ, LTE, GSM, WCMDA, బ్లూటూత్ 5.3, GPS సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×