BigTV English

Hyderabad:అసదుద్దీన్ ను చంపాలని చూస్తున్నదెవరు? వాళ్లేనా?

Hyderabad:అసదుద్దీన్ ను చంపాలని చూస్తున్నదెవరు? వాళ్లేనా?

Asaduddin Owaisi latest news(Telangana politics): ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తలలో ఉంటారు అసదుద్దీన్ ఒవైసీ. ఈ సారి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత. శుక్రవారం తన పార్టీ కార్యాలయంలో  మాట్లాడుతూ ఎవరో అజ్ణాత వ్యక్తులు తనని చంపుతామని ఫోన్ కాల్స్ చేస్తున్నారని, బెదిరింపుల మెసేజ్ లు పెడుతున్నారని అంటున్నారు. గతంలోనూ ఒవైసీ చాల సందర్భాలతో తనపై హత్యా ప్రయత్నాలు జరగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.


బీజేపీ పై ఫైర్

బీజేపీ దేశవ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తోందని ఆరోపిస్తున్నారు. అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని..తరతరాలుగా వస్తున్న ముస్లిం వివాహ చట్టం రద్దు చేయడమేమిటని ప్రశ్నించారు. పైగా అసోంలో ముస్లిం జనాభా పెరిగిందంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారని వాస్తవాలు కప్పిపుచ్చి ఎక్కవ చెబుతున్నారన్నారు. కేవలం 34 శాతమే ఉన్న ముస్లిం జనాభాను 40 శాతం కింద చూపిస్తున్నారని అన్నారు. కేంద్రం తెచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ కుట్రపూరితమని..మోదీ ప్రభుత్వానికి ముస్లింలపై ఉన్న వ్యతిరేకత చూపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎన్నికల ప్రచారానికి యూపీ వెళ్లినప్పుడు తనపై దుండగులు తొపాకులతో కాల్పులు జరిపారని అన్నారు. ఆ కేసులో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదని..యూపీ ప్రభుత్వం ఆ సంఘటనను చాలా తేలికగా తీసుకుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ముస్లింల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.


ఏక పక్ష నిర్ణయాలపై ఆగ్రహం

కనీసం ముస్లిం పెద్దల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఏక పక్షంగా చట్టాలను రద్దు చేయడం భావ్యం కాదని అన్నారు.తాను కేవలం ముస్లింల పక్షానే కాదు దేశ వ్యాప్తంగా బలహీన వర్గాలు, దళితుల పక్షాన మాట్లాటుతున్నానని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముస్లింలను బలవంతంగా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసదుద్దీన్. దేశంలో మైనారిటీలను చిన్నచూపు చూస్తున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని అన్నారు. తాను ముస్లింల గొంతుకై వారి తరపున ప్రశ్నిస్తున్నందుకే బెదిరింపులు వస్తున్నాయని..దీని వెనుక ఎవరు ఉన్నారో, ఏ శక్తులు ఉన్నాయో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎదుగుతోందని..పార్లమెంట్ లో స్థానాలు పెంచుకుంటున్నామని అన్నారు. తమ ఎదుగుదల చూసి ఓర్వలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని అన్నారు. కొన్ని హిందూ టెర్రరిస్ట్ సంస్థలే తనను బెదిరిస్తున్నాయని త్వరలోనే వాళ్ల గుట్టు బయటపడుతుందని అసదుద్దీన్ అన్నారు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×