Premium AI Washer Dryer: మారుతున్న జీవనశైలిలో సమయాన్ని ఆదా చేస్తూ.. ఇంటి పనిని సులువుగా ముగించే గృహోపకరణాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలలో రోజూ పేరుకుపోయే బట్టలను ఉతకడం, ఆరబెట్టడం అనేది పెద్ద టాస్క్. ఈ సమస్యకు పరిష్కారంగానే ప్రముఖ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్టీమ్ క్లీనింగ్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లతో కూడిన ప్రీమియం వాషర్ డ్రైయర్ మిషన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. బట్టలను ఉతకడంతో పాటు వంద శాతం ఆరబెట్టే సదుపాయం వీటిలో ఉండటం విశేషం.
ప్రస్తుత కాలంలో వస్తున్న వాషింగ్ మిషన్లు కేవలం బట్టలు ఉతకడానికే పరిమితం కాలేదు. ఎల్‌జీ, శాంంసంగ్, ఐఎఫ్‌బీ వంటి బ్రాండ్లు ఏఐ సాంకేతికతను వాడుతున్నాయి. ఇవి బట్టల బరువును, వాటి ఫ్యాబ్రిక్ రకాన్ని స్వయంగా గుర్తించి, వాటికి తగినట్లుగా నీటిని, డిటర్జెంట్‌ను తీసుకుంటాయి. దీనివల్ల బట్టలు పాడవకుండా ఉండటమే కాకుండా విద్యుత్, నీరు కూడా ఆదా అవుతాయి. పెద్ద కెపాసిటీ ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ బట్టలను ఉతుక్కోవచ్చు.
కొత్త తరం వాషర్ డ్రైయర్లలో ‘స్టీమ్ వాష్’ (ఆవిరితో ఉతకడం) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బట్టలలో ఉండే మొండి మరకలను, దుర్వాసనను వదిలించడంతో పాటు హానికరమైన బ్యాక్టీరియాను ఇది సమర్థవంతంగా తొలగిస్తుంది. చిన్నపిల్లలున్న ఇళ్లకు, అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఈ హైజీన్ స్టీమ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. బట్టలపై ముడతలు పడకుండా ఇది చూసుకుంటుంది.
Also Read: జియో గేమ్ ఛేంజర్ ఆఫర్.. అన్ని బ్రాండ్ల కీప్యాడ్ ఫోన్లకూ రోజుకు రూ.4కే ప్లాన్!
ఈ ప్రీమియం మిషన్లు Wi-Fi సదుపాయంతో వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఇంటి బయట ఎక్కడ ఉన్నా సరే, వాషింగ్ సైకిల్‌ను ఆపరేట్ చేయొచ్చు. బట్టలు ఉతకడం పూర్తవగానే ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్వర్టర్ మోటార్ల వాడకం వల్ల ఇవి తిరిగేటప్పుడు పెద్దగా శబ్దం లేదా వైబ్రేషన్ రాదు. దీంతో ఇళ్లలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
ఈ ఆల్ ఇన్ వన్ మిషన్లు ఎన్నో ప్రయోజనాలను ఇస్తున్నప్పటికీ.. కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సాధారణంగా వీటిలో బట్టలు ఉతికే కెపాసిటీ (ఉదాహరణకు 11 కేజీలు) కంటే ఆరబెట్టే కెపాసిటీ (7 కేజీలు) తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువ బట్టలున్నప్పుడు డ్రైయర్ కోసం రెండు సార్లుగా వేసుకోవాల్సి రావచ్చు. అలాగే ఇవి బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఒక చోటు నుండి మరోచోటుకు మార్చడం కొంచెం కష్టమైన పనే. అయినప్పటికీ.. బిజీ లైఫ్ ఉన్నవారికి ఇవి లగ్జరీగా కాకుండా నిత్యావసరంగా మారుతున్నాయి.
Also Read: నెలనెలా రీఛార్జ్ తిప్పలు వద్దు బాబోయ్.. Jio, Airtel, Viలలో రూ.500 లోపే 84 రోజుల బెస్ట్ ప్లాన్స్ ఇవే!