WhatsApp Messages: డేటా అనేది ఇప్పుడు కొత్త ఇంధనం. అన్నింటికీ ఇప్పుడు డేటా కీలకం. అయితే, ఆ డేటాను భద్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. నేటి సోషల్ మీడియా యుగంలో డేటాను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం అవసరం. వాట్సాప్ మెస్సేజింగ్ యాప్ డేటా రక్షణ కోసం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా యూజర్ల మధ్య జరిగే చాట్, ఇతర సమాచారం బయటకు పొక్కకుండా చోరీకి గురికాకుండా చూసుకుంటుంది. ఇదంతా ఉన్నా కొన్నిసార్లు మనం వ్యక్తిగతంగా పెట్టే మెస్సేజీలు మనం ఉద్దేశించినవారు కాకుండా వేరే వారు చూసే ముప్పు ఉన్నది.
కొన్ని సార్లు మీరు వాట్సాప్ టెక్స్ మెసేజీ చూడకముందే బ్లూ టిక్స్ వచ్చి ఉంటాయి. తద్వార ఈ మెస్సేజీ రీడ్ అని వాట్సాప్ సూచిస్తుంది. దీన్ని బట్టి ఆ మెస్సేజీని మీ కంటే ముందే వేరే వారు ఎవరో చదివారని అర్థం. అంటే మీ వాట్సాప్ అకౌంట్ వారికి యాక్సెస్ ఉన్నది అర్థం చేసుకోవాలి.
ఇలాంటి సందర్భంలో వాట్సాప్ మనకు ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. మీ వాట్సాప్ అకౌంట్‌తో లింక్ అయిన డివైజ్‌లను చూపించే ఫీచర్ ఉన్నది. ఇందుకోసం ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. వాట్సాప్ ఓపెన్ చేసి కుడి వైపు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కలను నొక్కడమే. ఆ తర్వాత మీరు లింక్డ్ డివైజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇది క్లిక్ చేయగానే.. మీ వాట్సాప్ అకౌంట్‌తో లింక్ అయిన డివైజ్‌లు అన్నీ వరుసగా మీకు కనిపిస్తాయి. అందులో మీకు తెలియకుండా.. మీరు వద్దనుకున్న డివైజ్ యాక్సెస్‌లో ఉంటే.. దాన్ని క్లిక్ చేసి లాగౌట్ అంటే సరిపోతుంది. ఇక ఆ డివైజ్ నుంచి మీ వాట్సాప్ యాక్సెస్ తొలగిపోతుంది.
Also Read: Ganesh Chaturthi 2024: 100 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం..ఈ 3 రాశులకు సంపద పొంగిపోతుంది
వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చారు. గతంలో ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లోకి ఎవరినైనా యాడ్ చేసేవారు. లేదా ఇన్విటేషన్ లింకులు పంపేవారు. కానీ, గ్రూప్‌లో యాడ్ చేసిన వ్యక్తి గురించి.. గ్రూప్ గురించి అందులో యాడ్ చేయడానికి ముందు తెలిసేది కాదు.
కానీ, ఇప్పుడు వాట్సాప్ ఒక మంచి ఫీచర్ తెచ్చింది. ఎవరైనా గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయాలనుకుంటే.. మీకు ముందగానే సదరు వ్యక్తి గురించి సమాచారం కాంటెక్స్ట్ కార్డ్ రూపంలో వాట్సాప్ అందిస్తుంది. ఆ గ్రూప్ గురించి కూడా మీకు తెలియజేస్తుంది.
మీకు ఆ గ్రూప్ ఉపయోగపడుతుందని అనుకుంటే.. యాక్సెప్ట్ చేసి గ్రూప్‌లో యాడ్ అయిపోవచ్చు. లేదంటే రిజెక్ట్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. మీకు తెలిసిన వ్యక్తి నెంబర్ మీరు సేవ్ చేయని పరిస్థితుల్లో వారు మీకు గ్రూప్ ఇన్విటేషన్ పంపితే.. వారిని గుర్తు పట్టడానికి ఈ కాంటెక్స్ట్ కార్డు ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ ఉపయోగించుకుని మీ కంటే ముందు వేరే వాళ్లు మీ మెస్సేజీలు చదవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.