రద్దీగా ఉన్న రైళ్లలో మహిళలతో కొంత మంది ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కొంత మంది కావాలని వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఇబ్బంది పెట్టడం చూస్తుంటాం. కొంత మంది ఇలాంటి వేషాలు వేసి తుంటరి కుర్రాళ్లకు తగిన బుద్ధి చెప్తే, మరికొంత మంది ఎందుకులే గొడవ అని సైలెంట్ గా ఉండిపోతారు. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియోను చూస్తే కోపంతో ఊగిపోవడం పక్కా. ఎందుకంటే..
తాజాగా బీహార్ లోని ఛప్రా దగ్గర ప్యాసింజర్ రైలు(55103)లో జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో సుమారు 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మైనర్ బాలిక పక్కన కూర్చున్నాడు. ఆ సీట్లు ఎక్కువ మంది ఉన్నారు. అమ్మాయి తల్లి పక్కనే కూర్చుంది. ఒకరికొకరు ఇరుకుగా కూర్చున్నారు. ఇదే అదునుగా భావించిన సదరు వ్యక్తి తన ఎడమ చేతితో ఎవరికీ కనిపించకుండా అమ్మాయి ఒంటి మీద చేయివేసి తడమడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ఎదరు సీట్లోని ప్రయాణీకుడు.. ఆ పెద్ద మనిషి చేస్తున్న చెత్త పనిని ఫోన్ లో రికార్డు చేశాడు. తన ఘనకార్యాన్ని రికార్డు చేస్తున్నట్లు గుర్తించిన అతడు, వెంటనే ఆ అమ్మాయి ఒంటి మీది నుంచి చేయి తీశాడు.
అటు ఈ విషయాన్ని వీడియో తీయడంతో సదరు వ్యక్తి భయంతో వణికిపోయాడు. వెంటనే, ఈ వీడియో షూట్ చేసిన ప్యాసింజర్ ను బతిమిలాడి వీడియోను డిలీట్ చేయించే ప్రయత్నం చేయాలనకున్నాడు. ఇతర ప్రయాణీకుడితో కలిసి అతడి ఫోన్ ను కొట్టేసే ప్రయత్నం చేశాడు. కానీ, అతడి మాటలను సదరు ప్రయాణీకుడు నమ్మలేదు. నెమ్మదిగా అతడు అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
यहां वीडियो देखिए pic.twitter.com/P3Zze73ZvC
— Nitin Prajapati (@Prajapat204) October 19, 2025
Read Also: ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని సమోసాల విక్రేత దౌర్జన్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!
ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “వయసు పెరిగిన బుద్ధి పెరగలేదు. కూతురు కంటే చిన్న అమ్మాయితో ఇలాంటి దుర్మార్గపు పనులు చేయాలని ఎలా అనిపించిందో అర్థం కావడం లేదు. అతడిపై కచ్చితంగా సీరియస్ కేసులు నమోదు చేయాలి. కఠినంగా శిక్షించాలి” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇలాంటి వ్యక్తులు బయట తిరగడానికి అస్సలు అర్హులు కాదు. వీరి పర్మినెంట్ అడ్రస్ జైలు కావాలి” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండాలంటే కచ్చితంగా కఠిన శిక్ష పడాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: రైళ్లలో ఫుడ్ ఇలాంటి కంటేనర్లలో ప్యాక్ చేస్తారా? చూస్తే వాంతి చేసుకోవడం పక్కా!