YSRCP ZPTC Murder: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వైసీపీ జెడ్పీటీసీ నూకరాజును గుర్తుతెలియని దుండగులు అతి కిరాతంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోలుగుంట మండలం ఛటర్జీపురంలో ఉన్న భూమి వివాదం.. ఈ హత్యకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ భూమి నూకరాజు పేరుపై ఉండగా, ఆ ప్రాంతంలోని కొందరు గిరిజనులు ఆ భూమిని తమ సొంతం అంటూ పలుమార్లు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మధ్యవర్తిత్వం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నించినప్పటికీ పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం రక్తపాతం వరకు దారితీసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూకరాజుకు సుమారు 10 ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజులపాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల నేపథ్యంలో బైండోవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జడ్పిటీసి నూకరాజు భూముల దగ్గరికి వెళ్లారు. గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం నడిచింది. మాట మాట పెరిగి గిరిజనులు ఆయనను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Also Read: కానిస్టేబుల్‌ని చంపిన రియాజ్ ఖతం
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చటర్జీపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భూమి వివాదం కోణంలోపాటు, రాజకీయ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
వైసీపీ ZPTC దారుణ హత్య
అల్లూరి జిల్లా కొయ్యూరు వైసీపీ జెడ్పీటీసీ నూకరాజుని హత్య చేసిన దుండగులు
రోలుగుంట మండలం ఛటర్జీపురంలో ఆయన పేరున ఉన్న 10 ఎకరాల భూమి విషయంలో గిరిజనులు, నూకరాజుకు మధ్య గొడవ
గతంలోనూ నూకరాజుపై హత్యాయత్నం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు pic.twitter.com/ZU3sqQinqX
— BIG TV Breaking News (@bigtvtelugu) October 20, 2025