Game Changer: సాధారణంగా .. తమ అభిమాన హీరో సినిమా అప్డేట్ రాకపోతే ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం చూస్తూనే ఉంటాం. టీజర్ డేట్ చెప్పలేదని, ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదని వారి అఫిషియల్ అకౌంట్స్ ను ట్యాగ్ చేసి ఫైర్ అవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ, ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కాస్తా హద్దుమీరి ప్రవర్తించారు.
ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సాంగ్ తరువాత ఈ సినిమా గురించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ రాలేదు.
మొదట్లో దిల్ రాజ్ డిసెంబర్ లో సినిమా వస్తుంది అని చెప్పాడు. అది కూడా ఆ తరువాత పోస్ట్ పోన్ అయ్యిందని టాక్. షూటింగ్ ను ఫినిష్ చేసుకున్నా.. ఇంకా ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీని గురించి మేకర్స్ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఫ్యాన్స్ .. సోషల్ మీడియాలో అసభ్యపదాలతో ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
ఇక ఈ ట్రెండ్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మండిపడ్డాడు. వాటి వలన ఏం ఉపయోగం అని చెప్తూ ఫ్యాన్స్ ను కూల్ అవ్వమని కోరాడు. ” అసభ్యమైన కామెంట్స్ చేయడం వలన, ఇలా నెగిటివ్ ట్రెండ్ చేయడం వలన ఉపయోగం ఏంటి. దీనివలన సినిమాకు ఉన్న గొప్పతనం పోతుంది.మా టెక్నికల్ టీమ్ అంతా గత 2 సంవత్సరాలఎంతో భద్రంగా కథను దాస్తున్నాము, దానిని మీ అందరికి గొప్ప పద్ధతిలో అందించాలని అనుకుంటున్నాము.
దయతో మాకు కొంత సానుకూల శక్తిని అందించాలని అభిమానులందరికీ హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి మాటలు.. నిర్మాతలను, నటీనటులను ఎంతో బాధపెడుతున్నాయి. మేము తక్కువలో లేము.. స్ట్రాంగ్ గా వస్తాము. ఖచ్చితంగా ఈ నెలలో అప్డేట్ తో వస్తాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
What is the use of Spreading or initiating – Negative trends or passing Vulgar comments .. it’s only goona hurt the FILM and it’s magnanimity.
All our Technical Team Are holding & Securing Content from last 2 years To bring it to U all in a GRAND MANNER 🏆
I request from the…
— thaman S (@MusicThaman) September 4, 2024