BigTV English

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్ ఫ్యామిలీకి కోటి పరిహారం.. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి ఏమన్నారంటే?

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్ ఫ్యామిలీకి కోటి పరిహారం.. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి ఏమన్నారంటే?
Advertisement

DGP Shivadhar Reddy: నిజామాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్‌ మృతిచెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారు. పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో రియాజ్‌ మరోసారి దాడికి పాల్పడటం, ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని డీజీపీ వెల్లడించారు.


రియాజ్ ను పోలీసులు ఆదివారం రోజున అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కానిస్టేబుల్‌ ఆసిఫ్‌పై దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రియాజ్‌కు స్వల్ప గాయాలవడంతో.. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రిలో చేర్చారు. డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌ బాత్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.

‘రియాజ్‌ను తిరిగి పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సమయంలో రియాజ్‌, పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాన్ని లాక్కుని వారిపైనే కాల్పులు జరిపేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో రియాజ్‌ చనిపోయాడు’ అని డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.


ఈ రోజు రియాజ్‌ మరో కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడని డీజీపీ తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకుండా, ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ALSO READ: SEBI: రూ.1,26,000 జీతంతో సెబీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, ఉద్యోగం మీదే బ్రో

నిజామాబాద్‌లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్‌ షేక్ రియాజ్ గత శుక్రవారం సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. నిందితుడిని తక్షణమే పట్టుకోవాలని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డీజీపీ శివధర్‌రెడ్డి, ప్రమోద్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమోద్‌ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన ప్రమోద్‌ సేవలు అజరామరం అని డీజీపీ కొనియాడారు. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు.

ALSO READ: Morning walk Or Evening walk: ఉదయం లేదా సాయంత్రం.. ఎప్పుడు నడిస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయ్ ?

Related News

YSRCP ZPTC Murder: మన్యంలో ZPTC దారుణ హత్య.. గిరిజనులు కొట్టి చంపేశారు

Riyaz Encounter: రౌడీ రియాజ్ మృతి.. హాస్పిటల్ లో ఏం జరిగింది?

CMR Founder Passes Away: బిగ్ బ్రేకింగ్.. సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ వ్యవస్థాపకుడి కన్నుమూత

Crime News: పండుగ పూట విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తల్లి..

Firecracker Blast: బాణసంచా నిల్వ ఉన్న ఇంట్లో భారీ పేలుడు.. నలుగురు మృతి

Nizamabad News: రియాజ్‌ను ఎన్ కౌంటర్ చేయలేదు.. నిజామాబాద్ సీపీ కీలక ప్రకటన

Asifabad Crime: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

Big Stories

×