Sai Dharam Tej: ఇండస్ట్రీలోనే కాదు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందు ఉండే కుటుంబం మెగా ఫ్యామిలీ. తమను ఎంతో ఆదరించే ప్రేక్షకులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడంలో మెగా ఫ్యామిలీ అస్సలు ఆలోచించదు.
ప్రస్తుతం వరదలు రెండు తెలుగురాష్ట్రాలను అల్లకల్లోలం చేసిన విషయం తెల్సిందే. ఈ వరదల కారణంగా ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. తిండిలేక అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ స్థాయికి తగ్గట్లు విరాళాలను అందిస్తున్నారు.
మెగా కుటుంబం నుంచి ఇప్పటికే.. చిరంజీవి రూ. 1 కోటి, రామ్ చరణ్ రూ. 1 కోటి, అల్లు అర్జున్ రూ. 1 కోటి .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ. 6 కోట్లు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. గత కొన్నిరోజులుగా పవన్ కు అండగా ఉన్నందుకు తేజ్ మీద కూడా కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా ఒక వైసీపీ నేతతో తేజ్ సోషల్ మీడియా వేదికగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే తేజ్ సైతం తనవంతు సాయం అందజేశాడు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేస్తున్నట్లు తెలిపాడు.
” రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు. (మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళం గా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ.. మీ సాయి దుర్గ తేజ్” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు తేజ్ ను ప్రశంసిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు.…
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 4, 2024