BigTV English

Realme GT 7 Pro: ఏందిరా బై ఇది.. 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కొత్త ఫోన్.. 5 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్..!

Realme GT 7 Pro: ఏందిరా బై ఇది.. 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కొత్త ఫోన్.. 5 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్..!
Advertisement

Realme GT 7 Pro: ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో తన ఆదిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కంపెనీ మరొక మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనీస్ మార్కెట్‌తో పాటు భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్‌లలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాబోయే రియల్‌మి స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ.. కొన్ని లీక్‌లు ఇప్పటికే దర్శనమిచ్చాయి.


గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ గురించిన సమాచారం లీక్ చేయబడింది. ఇక ఇప్పుడు ఈ రాబోయే Realme స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించే ముందు కంపెనీ తన కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా పరిచయం చేయగలదని తాజా లీక్ పేర్కొంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని చైనీస్ టిప్‌స్టర్ వెల్లడించాడు. రాబోయే GT 7 ప్రో లాంచ్ ఈవెంట్‌లో Realme తన 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించవచ్చని తెలిపాడు. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని స్పెసిఫికేషన్‌ల గురించి కూడా సమాచారం వెల్లడించాడు.

Also Read: స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్‌టీవీల వరకు అన్నీ ఇక్కడే.. ఏది కావాలో ఎంచుకోండి బ్రదర్..!


Realme GT 7 Pro వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP69 రేటింగ్‌తో వస్తుందని చెప్పబడింది. ఇది కాకుండా డిస్ప్లే కింద సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. Realme GT 7 Pro ఫోన్‌ 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుందని టిప్‌స్టర్ స్పష్టం చేశాడు. గత నెల జూన్‌లో Realme గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ ఫ్రాన్సిస్ వాంగ్ మాట్లాడుతూ.. కంపెనీ ప్రస్తుతం తన 300W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ఇది తప్పించి ఆయన ఎలాంటి ఇతర సమాచారం ఇవ్వలేదు.

అయితే Realme 300W ఛార్జింగ్ టెక్నాలజీ మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలో 0 నుండి 50 శాతం వరకు, ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తి ఛార్జింగ్ చేయగలదని చెప్పబడింది. రాబోయే Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉండనున్నాయి. రాబోయే ఫోన్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఇది 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే Qualcomm Snapdragon8 Gen 4 SoCలో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఇది ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Related News

Samsung Galaxy S26 Ultra: శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా.. 220ఎంపి కెమెరా, 6000mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్

Motorola 5G 2025: మోటోరోలా 5G 2025 లాంచ్.. 6000mAh మోన్స్టర్ బ్యాటరీ, 210W ఫాస్ట్ చార్జ్!

Pixel 10 Pro Fold Explode: పేలిపోయిన రూ.1.72 లక్షల ఫోన్.. టెస్టింగ్‌లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఫెయిల్

Mappls immobiliser: ఒక్క ఓటీపీతో కారు దొంగలకు చెక్.. మ్యాప్‌ల్స్‌ యాప్‌లో సూపర్ ఫీచర్

Samsung 55 QLED TV: దీపావళికి శామ్సంగ్ 55 క్యూఎల్‌ఇడి టీవీపై 80శాతం తగ్గింపు.. లిమిటెడ్ స్టాక్ మిస్స్ అవ్వకండి..

iPhone Air Discount: ఐఫోన్ ఎయిర్‌పై తొలిసారి తగ్గింపు.. లాంచ్ అయిన కొద్ది వారాలకే ఆఫర్

OnePlus Nord CE5 5G: వన్‌ప్లస్ కొత్త సంచలనం.. రూ.22 వేలకే నార్డ్ సిఈ5 5జితో మిరాకిల్ ఫోన్

Honda Gold Wing Bike: ఏంటీ.. ఈ బైక్ ధర రూ.43 లక్షలా? దీని ఫీచర్స్ తెలిస్తే ఏమైపోతారో?

Big Stories

×