Venkatesh and Rana at Nampally Court: దక్కెన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి హైకోర్టు దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, హీరో రానాలు ఝలక్ ఇచ్చింది. నేడు (అక్టోబర్ 16) నాంపల్లి కోర్టులో విచారణకు వెంకటేష్, రానా, సురేష్ బాబు, అభిరాంలు హాజరయ్యారైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఫిలిం నగర్లోని ఈ భూవివాదం కేసులో తరచూ వీరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గురువారం ఈ కేసు విచారణ నేపథ్యంలో నేడు ఉదయం నాంపల్లి కోర్టు హాజరయ్యారు. తాజాగా ఈ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఈ కేసులో కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని హీరో వెంకటేష్, రానా, అభిరామ్, దగ్గుబాటి సురేష్ బాబులను ఆదేశించింది. వచ్చేనెల నవంబర్ 14న కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెలిపింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. కాగా రెండు నెలల క్రితం తన రెస్టారెంట్ని కూల్చివేశారంటూ దక్కన్ కిచెన్ యజమాని దగ్గుబాటి ఫ్యామిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ అతడు కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ కేసులో విచారణకు రావాలని రానా, వెంకటేష్, సురేష్ బాబు, అభిరామ్లకు నాంపల్లి కోర్టు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే వారు విచారణకు హాజరకాకుండ కాలాయాపన చేస్తున్నారు. తరచూ విచారణ వాయిదా వేస్తూ కోర్టు రావడం లేదు. ఈ క్రమంలో నేటి విచారణలో దగ్గుబాటి హీరోలపై న్యాయస్థానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గత నెల ఆగష్టు 1న విచారణకు రాకపోవడంపై కోర్టు వారికి చీవాట్లు పెట్టినట్టు సమాచారం. ఆగష్టు 1 జరగాల్సిన విచారణ నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తప్పకుండ కోర్టు విచారణ హాజరు కావాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే కేసులు తప్పవని వారిని న్యాయస్థానం హెచ్చరించింది.
కాగా కొంతకాలంగా డెక్కన్ కిచెన్ హోటల్‌పై దగ్గుబాటి ఫ్యామిలీకి వివాదం నెలకొంది. ఈ స్థలం తమదంటే తమదని ఇరు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌనర్సతో కలిసి డెక్కన్ కిచెన్ హోటల్ను ధ్వంసం చేసింది దగ్గుబాటి ఫ్యామిలీ. ఈ క్రమంలో అతడు హోటల్ యాజమాని కోర్టు ఆశ్రయించారు. దీంతో ఆ స్థలంపై జోక్యం చేసుకోవద్దని దగ్గబాటి ఫ్యామిలికి కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయినా కూడా దగ్గుబాటి కుటుంబం న్యాయస్థానం ఆదేశాలను సైతం దిక్కరించి హోటల్ను కూల్చివేసింది. దాంతో హాటల్ యజమాని నందకుమార్ పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు నమోదు చేశారు. పలు విచారణ అనంతరం ఈ కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుపై విచారణ కోసం కోర్టు రావాలని పలుమార్లు నోటీసులు ఇవ్వగా దగ్గుబాటి హీరోలు హాజరవకుండ తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి విచారణలో వారి తీరుని న్యాయస్థానం తప్పుబట్టింది. ఎట్టి పరిస్థిల్లోనూ కోర్టుకు హాజరవ్వాల్సిందేనని, నవంబర్ 14న జరిగే విచారణకు తప్పుకుండ హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.