A man arrested harassment in Train(Telugu news updates): రైలులో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులు రియాక్ట్ అయ్యారు. అతగాడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంచలనం రేపిన ఈ వ్యవహారం బెంగుళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్‌లో చోటు చేసుకుంది.
బెంగుళూరు నుంచి హౌరా ట్రైన్ వెళ్లోంది. మంగళవారం అర్థరాత్రి రెండు గంటలు దాటాక సామర్లకోట స్టేషన్‌లో ఆగింది. వెంటనే బయలుదేరిన కాసేపటికి.. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉన్నారు. ఈలోగా ఓ యవతి వద్దకు వెళ్లాడు యువకుడు.
ఆ తర్వాత పలుమార్లు యువతిని తాకడాడు. ఈలోగా ఆమెకి తెలివి వచ్చింది. వెంటనే అలర్ట్ కావడమే కాదు.. గట్టిగా కేకలు వేసింది. యువతి అరుపులు విన్న తోటి ప్రయాణికులు వెంటనే లైట్లు వేసి చూడగా, యువకుడితో యువతి గొడవ పడుతోంది.
ALSO READ: తిరుమల ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
జరిగిన విషయాన్ని తోటి ప్రయాణికులకు చెప్పింది ఆ యువతి. ఆ తర్వాత కామాంధుడ్ని ఎడాపెడా చావా బాదాలు తోటి ప్రయాణికులు. తెల్లవారుజామున రైలు విశాఖపట్నం చేరుకుంది. ఈలోగా నిందితుడ్ని రైల్వే పోలీసులకు ప్రయాణికులు అప్పగించారు. నిందితుడికి సరైన బుద్ది చెప్పాలని ప్రయాణికులు పోలీసులను కోరారు.
దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు తీవ్రమవుతున్నాయి. పాఠశాలలు, బస్సుస్టేషన్లు, రైల్వేస్టేషన్లు, చివరకు రైళ్లలోనూ ఈ తరహా ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే.
రన్నింగ్ ట్రైన్‌లో విద్యార్థినితో వెకిలివేషాలు
విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రన్నింగ్ ట్రైన్‌లో నిద్రలో ఉన్న విద్యార్థినికి లైంగిక వేధింపులు.
పలుమార్లు తాకేందుకు ప్రయత్నించడంతో అలెర్ట్ అయిన యువతి.
తోటి ప్రయాణికుల సహాయంతో రైల్వే పోలీసులకు నిందితుడిని అప్పగించిన యువతి.… pic.twitter.com/XWHE8MvjKM
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2024