Case on Bigg Boss telugu: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌కు ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిందే. సీజన్ సీజన్ కొత్తగా లాంచ్ చేస్తూ ఆడియన్స్కి వినోదం అందిస్తున్నారు. సెలబ్రిటీలందరికి ఒక్కదగ్గరి చేర్చి మూడు నెలల పాటు వారిని హౌజ్లో హోల్డ్ చేస్తారు. ఈ క్రమంలో వారి మధ్య జరిగే గొడవలు, వివాదాలు, లవ్ ట్రాక్స్ ఆడియన్స్‌ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను సక్సెస్ ఫుల్ పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9వ సీజన్ని జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ షోకు బిగ్ షాక్ తగిలింది.
బిగ్ బాస్‌ని ఆపేయాలంటూ పోలీసు స్టేషన్ కేసు నమోదైంది. బిగ్‌బాస్ షోని నిలివేయాలంటూ కమ్మరి శ్రీనివాస్, బి రవిందర్ రెడ్డి అనే వ్యక్తులు బంజారామిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ షో ద్వారా అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ, యువతను తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు. అంతేకాదు ఈ రియాలిటీ షోపై తరచూ ఆరోపణలు, ఫిర్యాదు వస్తున్నాయిని వారు పేర్కొన్నారు. ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Rana – Venkatesh: కోర్టులో రానా, వెంకటేష్‌లకు ఝలక్.. హాజరుకావాల్సిందేనంటూ
టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ బిగ్ బాస్ తరచూ ఎదోక వివాదంలో నిలుస్తోంది. ప్రతి సీజన్ సామాజిక వేత్తలు, వివిధ సంఘాలు నేతల నుంచి తరచూ అభ్యంతరాలు వస్తుంటాయి. గతంలో సీపీఐ నేత అల్లం నారాయణ వంటి ప్రముఖులు సైతం ఈ బిగ్ బాస్ షో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదోక బ్రోతల్ హౌజ్ బహిరంగం కామెంట్స్ చేశారు. ఈ షోని తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వాలకు లేఖ కూడా రాశారు. ఈ కేసు కోర్టు వరకు కూడా వెళ్లింది. ఇక బిగ్ బాస్ 7 టైంలో కూడా ఇది తీవ్ర వివాదంలో నిలిచింది. కామనర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచి బయటకు వచ్చాక తన అనుచరులతో కలిసి హౌజ్ బయట రచ్చ రచ్చ చేశారు. ఈ వ్యవహరం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది.
రైతు బిడ్డపై కేసు కూడా నమోదైంది. ఇలా ఈ తెలుగు బిగ్ బాస్ ని ప్రతిసారి వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం గొడవలు, వివాదాలతో రసవత్తరంగా సాగుతున్న ఈ బిగ్ బాస్ పై తాజాగా కేసు నమోదవ్వడం టీంని ఆందోళన కలిగిస్తోంది. మరి దీనిపై బిగ్ బాస్ టీం ఎలా స్పందిస్తునేది ఆసక్తిని సంతరించుకుంది. కాగా ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్స్ రావడంతో షో రసవత్తరంగా మారింది. హౌజంత గొడవలతో మారుమోగుతుంది. ముఖ్యంగా హౌజ్ లో దువ్వాడ మాధురి పెత్తనం చేస్తూ కంటెస్టెంట్స్ ని తన అదుపులోకి పెట్టుకోవాలని చూస్తుంటే. కదిలిస్తే చాలు కయ్యానికి కాలు దువ్వుతుంది. ఆమె తీరు చూస్తుంటే అసలు గొడవల కోసం బిగ్ బాస్ కి వచ్చిందా అంటున్నారు ఆడియన్స్.