Kohli: 2027 కంటే ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నా నేపథ్యంలో విరాట్ కోహ్లీ ( Virat Kohli) సంచలన పోస్ట్ పెట్టాడు. ఆ రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెడుతూ సంచలన పోస్ట్ వదిలి, తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు కోహ్లీ. మనం ఎప్పుడైతే చేతు లెత్తేస్తామో అప్పుడు మనకు మాత్రమే ఓటమి వస్తుందని ఈ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక దీనిపై రకరకాలుగా విరాట్ కోహ్లీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడుతానని విరాట్ కోహ్లీ పరోక్షంగా చెప్పినట్లు ఆయన అభిమానులు వెల్లడిస్తున్నారు. అదే సమయంలో గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ లకు కౌంటర్ ఇచ్చేందుకు ఈ పోస్ట్ పెట్టినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ తాజాగా చేసిన సింగిల్ లైన్ పోస్ట్ హాట్ టాపిక్ అయింది.
వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ఆడకుండా విరాట్ కోహ్లీని ముందే పంపించేందుకు గంభీర్ అలాగే అగార్కర్ కుట్రలు పన్నుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ సంచలన పోస్ట్ పెట్టారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతనని పరోక్షంగా చెబుతూ ఈ ట్వీట్ చేశారు కోహ్లీ. అయితే అగార్కర్ అలాగే గౌతమ్ గంభీర్ ఇద్దరికీ కౌంటర్ ఇచ్చేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా స్పందించినట్లు చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతున్న నేపథ్యంలో కోహ్లీ నుంచి ఈ ట్వీట్ రావడం కొత్త వివాదానికి తెరలేపుతోంది. ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ తరహాలోనే రోహిత్ శర్మ కూడా ఒక పోస్ట్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు ఎదురు తిరగబడితేనే, గౌతమ్ గంభీర్ అలాగే అగార్కర్ ఆటలు కట్టించవచ్చని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలను అవమానపరిచేలా గౌతమ్ గంభీర్ అలాగే సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వ్యవహరిస్తున్నారు. అసలు 2027 వన్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలను పరిగణలోకి తీసుకోవడం లేదని అజిత్ అగార్కర్ మొన్న పేర్కొన్నారు. లేటెస్ట్ గా గౌతమ్ గంభీర్ కూడా ఇలాగే వ్యవహరించారు. వాళ్లు ఆడేది గ్యారెంటీ లేదని కుండ బద్దలు కొట్టారు. ఇలాంటి నేపథ్యంలోనే కోహ్లీ రియాక్షన్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదే సమయంలో, విరాట్ కోహ్లీ తరహాలో రోహిత్ శర్మ స్పందించాలని కోరుతున్నారు ఫ్యాన్స్.
Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్పకుండానే ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే
They made a huge mistake by hurting his ego, im gettin 2016/18 vibes.. https://t.co/hRHmyTHSvT pic.twitter.com/uUomng0FtY
— Kevin (@imkevin149) October 16, 2025
— Gems of Cricket (@GemsOfCrickets) October 16, 2025