Prashanth Neel:ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ గోల ఎక్కువైపోయింది. ఆ సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా దానికి సీక్వెల్స్ మాత్రం ఖచ్చితంగా తీస్తున్నారు. అలా బాహుబలి సినిమాతో మొదలైన ఈ సీక్వెల్స్ ట్రెండ్, పాన్ ఇండియా ట్రెండ్ అలా కొనసాగుతూనే ఉంది. అయితే సినిమాలు హిట్ అయినా కాకపోయినా చివరికి సీక్వెల్ ఉంటుంది అన్నట్లుగా హింట్స్ ఇచ్చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ‘బాహుబలి’ తర్వాత మళ్లీ అంతటి హిట్ సాధించిన సినిమాల్లో ‘కేజీఎఫ్’మూవీ కూడా ఉంటుంది. ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీ స్థితిగతులనే మార్చేసింది. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ సినిమాలను ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో యష్(Yash ) నటించిన ‘కేజీఎఫ్’ మూవీ ఒక్కసారిగా ఇండస్ట్రీ రూపురేఖలే మార్చేసింది. అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది. అలా కేజీఎఫ్ 1& 2 చిత్రాలు ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించాయి.
ఇక కేజీఎఫ్ సినిమా విషయం పక్కన పెడితే ఈ సినిమా బాగుండడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమాకి చివర్లో కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కేజిఎఫ్-3 కి సంబంధించిన అప్డేట్ ఏమీ రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా డైరెక్టర్ సోషల్ మీడియా ఖాతాలో కేజిఎఫ్ 3 గురించి ఒక సంచలన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ చూసిన యష్ అభిమానులు , కేజీఎఫ్ మూవీ ఫ్యాన్స్ అందరూ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఇంతకీ ప్రశాంత్ నీల్ ఇన్స్టా ఖాతాలో ఏం పెట్టారు.. సినిమా ఎప్పుడు రాబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం..
తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కేజీఎఫ్ 3 మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ వైరల్ అవుతోంది . అందులో ఏముందంటే.. కేజీఎఫ్ చాప్టర్ 3 అనే పోస్టర్ ఉంది. దీంతో ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు కేజీఎఫ్ చాప్టర్ 3 రాబోతోందా? ప్రశాంత్ నీల్ ఈ విధంగా హింట్ ఇచ్చారా అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో కొంతమంది ఇది ఫేక్ పోస్ట్ అని కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీల పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమ కొత్త సినిమాలకు సంబంధించి లేదా అప్పటివరకు అధికారికంగా బయట పెట్టని వాటి గురించి పోస్టులు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ ద్వారా ఈ కేజీఎఫ్ చాప్టర్ 3 అనే పోస్టర్ వైరల్ అవుతుందని భావిస్తున్నారు.
ALSO READ:Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. గేమ్ కాదు ఫిజికల్ వయోలెన్స్.. అరె ఏంట్రా ఇది!
ఎందుకంటే ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ -3 గురించి ఎక్కడా కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అలా అధికారికంగా రాకుండా ఇలా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వచ్చింది అంటే అది ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే ఇది ఫేక్ అనడానికి మరో కారణం ఏంటంటే? ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో చాలా బిజీగా ఉన్నారు. డ్రాగన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా షూట్ అయిపోవడంతోనే ఆయన వెంటనే సలార్ -2 సెట్స్ లో జాయిన్ అయిపోతారు. అలా సలార్ 2 షూటింగ్ కూడా అయిపోయాక కేజీఎఫ్ -3 సెట్స్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తవ్వాలంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పట్టేలానే ఉంది. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ 3 నుండి అప్డేట్ ఎలా ఇస్తారు అని అనుమాన పడుతున్నారు. మరి కేజిఎఫ్ -3 రాబోతోంది అనే పోస్టర్లో ఉన్న నిజం ఎంత..అది నిజంగానే ప్రశాంత్ నీల్ పోస్ట్ చేశారా.. లేక ఫేక్ అకౌంట్ నుండి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.
కేజీఎఫ్ మూవీ విషయానికి వస్తే.. కన్నడ హీరో యష్, శ్రీనిధి శెట్టి లు నటించిన కే జి ఎఫ్ చాఫ్టర్ 1 మూవీ 2018లో విడుదల అయింది.కోలార్ బంగారు గనులను ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. ఈ మూవీకి సీక్వెల్ 2022లో వచ్చి అంతర్జాతీయ లెవెల్లో భారీ క్రేజ్ తెచ్చుకుంది.