Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్‌ల మధ్య యుద్ధం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ దాడిలో తాలిబన్ల సైనికులు 40 మంది మరణించగా.. మరో వైపు పాక్ సైనికులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం విరమణ అందుబాటులోకి వచ్చినా.. ఇరు దేశాలు మాత్రం సరిహద్దుల్లో దాడులు చేసుకుంటున్నారు. బలిచిస్తాలో తాలిబన్లు దాడులకు తెగబడి కాల్పులు జరిపారని.. దానికి ప్రతీకారంగా దాడులు చేశామని పాక్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్ కోరిక మేరకు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో సరిహద్దుల నుంచి సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.