Student Suicide: నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం నెలకొంది. కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉదయ్.. క్లాస్ రూమ్‌లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఓ మహిళా లెక్చరర్ మందలించి, మాటలతో వేధించడంతో.. మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉదయ్‌ను పోరుమామిళ్లకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు కాలేజీ నిర్వాహకులు.
విద్యార్థి ఆత్మహత్యతో ఆందోళన చేస్తున్న తోటి విద్యార్థులు..
విషయం విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజ్ వద్దకు చేరుకొని రోదిస్తున్నారు. ఉదయ్ క్లాస్‌మేట్స్ అందరూ ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతిపై ఏబీవీపీ నాయకులు కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన