E-Paper
Advertisement

Redmi Note 13 Pro 5G Scarlet Red: 200 MP కెమెరా.. అదిరిపోయిన రెడ్‌మీ కొత్త కలర్.. ఏకంగా రూ.6 వేల డిస్కౌంట్..!

Redmi Note 13 Pro 5G Scarlet Red: 200 MP కెమెరా.. అదిరిపోయిన రెడ్‌మీ కొత్త కలర్.. ఏకంగా రూ.6 వేల డిస్కౌంట్..!
Advertisement

Rs 6,000 Discount on Redmi Note 13 Pro 5G Scarlet Red: పవర్‌ఫుల్ కెమెరా స్పెసిఫికేషన్లతో షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త రెడ్‌మీ Note 13 Pro 5G లైనప్‌‌లో కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరా, 12 GB ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ రెడ్‌మీ నోట్ 13 ప్రో మొదటిసారి జనవరి 2023లో కంపెనీ ప్రారంభించింది.

Redmi Note 13 Pro 5G స్కార్లెట్ రెడ్ ఎడిషన్ భారతదేశంలో రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. అవి 8GB + 128GB, 8GB + 256GB. దీని ప్రారంభ ధర రూ. 24,999. అయితే హై ఎండ్ వెర్షన్ ధర రూ. 26,999. మీరు దీన్ని బ్రాండ్  అధికారిక వెబ్‌సైట్, అమోజాన్, ఫ్లిప్‌కార్ట్, షియోమీ రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

Advertisement

అంతేకాకుండా Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ ఉపయోగించినట్లయితే దీనిపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఇప్పటికే ఉన్న Xiaomi కస్టమర్లకు రూ. 3,000 అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఆఫర్ చేస్తోంది. మొత్తంగా రూ.6000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Also Read: సూపర్ ఫీచర్స్.. ఐక్యూ నుంచి మొదటి బడ్జెట్ ఫోన్.. ఇది మామూలు రేటు కాదు!

Advertisement

Redmi Note 13 Pro 5G మొదట మిడ్‌నైట్ బ్లాక్, కోరల్ పర్పుల్, ఆర్కిటిక్ వైట్ కలర్‌లలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇది ప్రత్యేక స్కార్లెట్ రెడ్ ఎడిషన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1800 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

Redmi Note 13 Pro 5G Qualcomm Snapdragon 7s Gen 2 SoCని కలిగి ఉంది. ఫోన్ Android 13 OS బేస్‌డ్ HyperOS కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. ఈ మోడల్ పెద్ద 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: ఐఫోన్ 15పై భారీ డీల్ బ్రో.. అస్సలు వదలొద్దు!

Redmi Note 13 Pro 5G కెమెరా విషయానికి వస్తే మీరు వెనుకవైపు 200-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ ఉంటుంది. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వాటర్,డస్ట్ నుంచి ప్రొటక్షన్ కోసం IP54 రేటింగ్, AG మాట్ గ్లాస్ బ్యాక్ కవర్, బ్లూటూత్ 5.2, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×