Casting Call from Vijay Devarakonda’s 14th Film: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మంచి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయినా తన క్రేజ్‌కి తగ్గట్టుగా మంచి హిట్ అయితే అందుకోలేకపోతున్నాడు. ఇటీవలే ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ సినిమా మొదటి నుంచి మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. అదే అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
యూత్ ఈ సినిమాను చూసేందుకు నిరాకరించారు. రొటీన్ పాత్రలు, రొటీన్ స్టోరీనే ఉందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమా అద్భుతంగా ఉందని తమ రివ్యూలని సైతం తెలిపారు. దీంతో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో మంచి కలెక్షన్లతో పర్వాలేదనిపించుకుంది.
దీని తర్వాత విజయ్ దేవరకొండ మరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఈ సారి నో రొమాన్స్.. నో యాక్షన్. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా విజయ్ కొత్త మూవీతో వస్తున్నాడు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాక్సీవాలా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కలిసి చేస్తున్న మూవీ ఇది.
Also Read: చారిత్రాత్మక కథతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. పోస్టర్ వచ్చేసింది!
ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ అత్యంత గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. డియర్ కామ్రేడ్, ఖుషి వంటి సినిమాల తర్వాత మైత్రి మూవీ మేకర్స్.. విజయ్ దేవరకొండతో చేస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ 19th సెంచరీ నేపథ్యంలో 1854 – 1978 మధ్య కాలంలో జరిగిన ఒక వీరుడి యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతుంది.
ఈ క్రమంలో ఈ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. సినిమాలో నటించాలన్న తపన, ఆసక్తి ఉన్నవారి కోసం మైత్రీ మూవీ మేకర్స్ వారు ఒక క్రేజీ ప్రకటన వదిలారు. ఈ మేరకు ‘విడి14’లో నటించేందుకు నటీ, నటులు కావాలంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ అంతా రాయలసీమలోనే ఉంటుంది కాబట్టి.. తిరుపతి, కడప, అనంతపురం, కర్నూల్‌లో ఉన్న మంచి ప్రతిభ గల యువతి, యువకులు కావాలని కోరారు.
Also Read: Kalki Movie Music Director: రేపే ‘కల్కి’ మూవీ విడుదల.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జూలై 1 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరుగుతాయని.. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు తమ మెయిల్, ఫోన్ నెంబర్‌ను అందించారు. దీని బట్టి చూస్తే.. ఈ జిల్లాల్లో ఉన్న వారికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి.
Here is a chance to be a part of #VD14
Auditions from 1st to 9th July. 10 AM to 5 PM.
For any queries,
Email : [email protected]
Phone : 8374782362@TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial @VD14TheFilm pic.twitter.com/2WczLAPckd— Rajasekar (@sekartweets) June 25, 2024