BigTV English

Reliance: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 100 జీబీ ఫ్రీ.. అంబానీ ఆఫర్ అదిరిపోయింది..!

Reliance: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 100 జీబీ ఫ్రీ.. అంబానీ ఆఫర్ అదిరిపోయింది..!

Reliance Jio AI-Cloud Welcome Offer: ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తాజాగా జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త ఆఫర్‌ను వెల్లడించారు. క్లౌడ్ స్టోరేజ్, AI-ఆధారిత సేవలను జియో వినియోగదారులందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే Jio AI-Cloud వెల్‌కమ్ ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు Jio వినియోగదారులు 100 GB వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను పొందుతారని అంబానీ వెల్లడించారు.


ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ సహా ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా స్టోరేజ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఈ క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించవచ్చు. రిలయన్స్ కంపెనీ ఏజీఎం సందర్భంగా తమ 35 లక్షల మంది వాటాదారులను ఉద్దేశించి అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. జియో వినియోగదారులకు వారి డిజిటల్ ఆస్తులను నిర్వహించడానికి సురక్షితమైన మార్గాన్ని అందించడం ద్వారా డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ ఆఫర్ రూపొందించబడిందని అంబానీ తెలిపారు.

ఈ మేరకు అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ప్రతిఒక్కరి దృష్టి కోసం మా AI ప్రతిచోటా మద్దతు ఇవ్వడానికి, Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. జియో వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను కల్పిస్తున్నాం. అంతేకాకుండా దీనికంటే మరింత ఎక్కువ డేటా స్టోరేజీ అవసరం అయిన వారికి అతి తక్కువ ధరలోనే క్లౌడ్ స్టోరేజీని అందుబాటులోకి తెస్తాం’’ అని అంబానీ తెలిపారు. క్లౌడ్ స్టోరేజీని అందుబాటులో ఉంచడం వెనుక ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.


Also Read: జియో సినిమా లో హాట్ స్టార్ విలీనం పూర్తి.. ఆమోదించిన సిసిఐ

అయితే ఈ జియో ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్ ఈ ఏడాది దీపావళి నుంచే అందుబాటులో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా డిజిటల్ సేవలను అందించడంలో జియో నిబద్ధతను హైలైట్ చేస్తూ అంబానీ మాట్లాడుతూ.. ఇంకా ఎక్కువ స్టోరేజ్ అవసరమయ్యే వారికి మార్కెట్‌లో అత్యంత సరసమైన ధరలను కూడా కలిగి ఉంటామని అంబానీ హామీ ఇచ్చారు.

ఇది జియో వినియోగదారుల కోసం డిజిటల్ సేవలను అందించడం కోసం పండుగ సీజన్‌ను ఎంచుకుంది. ప్రతిఒక్కరికీ, ప్రతిచోటా క్లౌడ్ డేటా స్టోరేజ్, AI సేవలను అందించే శక్తివంతమైన, సరసమైన పరిష్కారంగా అభివర్ణిస్తూ అంబానీ ఈ సరికొత్త ప్రయోగం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ‘‘మేము ఈ సంవత్సరం దీపావళి నుండి Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము.. క్లౌడ్ డేటా స్టోరేజ్, డేటా-ఆధారిత AI సేవలు ప్రతిచోటా అందుబాటులో ఉండే శక్తివంతమైన, సరసమైన పరిష్కారాన్ని తీసుకువస్తాము’’ అని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే మరోవైపు తక్కువ ధరలకే ఏఐ మోడల్ సేవలను అందిస్తామని కూడా అంబానీ తెలిపారు. దీంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు సైతం గుడ్ న్యూస్ చెప్పింది కంపెనీ. ఈ మేరకు 1:1 రేషియోలో ఈక్విటీ బోనస్ షేర్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే త్వరలో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించింది.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×