BigTV English

Reliance Disney Merger: జియో సినిమా లో హాట్ స్టార్ విలీనం పూర్తి.. ఆమోదించిన సిసిఐ

Reliance Disney Merger: జియో సినిమా లో హాట్ స్టార్ విలీనం పూర్తి.. ఆమోదించిన సిసిఐ

Reliance Disney Merger| దేశంలోని అతిపెద్ద మీడియా ఎంపైర్ గా ఎదగడానికి ప్రముఖ బిలయనీర్ బిజినెస్ మెన్ ముకేశ్ అంబానీ వేసిన మాస్టర్ స్ట్రోక్ ఫలించింది. ఆగస్టు 28 బుధవారం డిస్నీ ఎంటర్ టైన్మెంట్ ఇండియా కంపెనీ ముకెశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విలీనం అయ్యాయి. ఈ విలీన ప్రక్రియకు ప్రభుత్వ సంస్థ కాంపెటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదించింది. డిస్నీ ఎంటర్ టైన్మెంట్ మార్కెట్ విలువ 8.5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.70 వేల కోట్లు.


అయితే ఈ డీల్ గురించి ఆరు నెలల క్రితమే ప్రకటించినప్పటికీ, చట్ట పరంగా కొన్ని మార్పులు చేసిన తరువాత సిసిఐ ఈ విలీన ప్రక్రియపై అంగీకారం తెలిపింది. ఈ డీల్ ప్రకారం.. రిలయన్స్ కంపెనీలైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ 18 మీడియా లిమిటెడ్ కంపెనీలు, డిస్నీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ కంపెనీలు విలీనం అయ్యాయి.

ఈ ఒప్పందం ప్రకారం.. డిస్నీ, రిలయన్స్ రెండు కంపెనీలు భాగస్వాములుగా పనిచేస్తాయి. ఇందులో రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు 63.16 శాతం వాటాతో మొత్తం 120 టెలివిజన్ చానెల్స్ స్ట్రీమింగ్ హక్కులు పొందాయి. మరోవైపు వాల్ట్ డిస్నీ కంపెనీ గ్రప్ కంపెనీలకు 36.84 శాతం వాటా ఉంది. ఈ ఒప్పందంతో భారతదేశపు అతిపెద్ద మీడియా కంపెనీగా రిలయన్స్ డిస్నీ అవతరించింది. దీంతోపాటు ఎంటర్ టైన్మెంట్ బిజినెస్ లో జపాన్ కు చెందిన సోనీ, నెట్ ఫ్లిక్స్ కంపెనీలు గట్టి పోటీ ఇచ్చేందుకు ముకేశ్ అంబానీ ఒక జాయింట్ వెంచర్ కోసం మరో రూ.11,500 పెట్టుబడులు పెట్టనున్నారు.


ఈ జాయింట్ వెంచర్ కు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నేతృత్వం వహిస్తారు. అలాగే డిస్నీ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ కు ఈ జాయింట్ వెంచర్ లో వైస్ చైర్మన్ పదవి దక్కింది.

ఇంతకుముందు ఐపిల్, ఇతర క్రికెట్ టోర్నమెంట్ల స్ట్రీమింగ్ విషయంతో రిలయన్స్ కు చెందిన జియో సినిమా, డిస్నీకి చెందిన హాట్ స్టార్ ఓటీటీల మధ్య గట్టి పోటీ ఉండేది. అసలు హాట్ స్టార్ ఓటీటీ ఇండియాలో వేగంగా అతిపెద్ద ఓటీటీ సంస్థ ఎదిగేందుకు క్రికెట్ ప్రధాన కారణం. అందుకే హాట్ స్టార్ ఓటీటీకి దేశంలో అత్యధిక సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. కానీ 2023 నుంచి 2027 వరకు ఐపిఎల్, ప్రపంచ కప్ క్రికెట్ పోటీల ప్రసార హక్కులు రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 720 బిలియన్ డాలర్ల కు వేలం లో గెలుచుకుంది. దీంతో ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్రపంచంలో దూసుకుపోతోంది.

అయితే రిలయన్స్, డిస్నీ ఒప్పందం వల్ల మోనొపొలీ పరిస్థితులు ఏర్పడకుండా ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైన సిసిఐ విచారణ కూడా చేసే అవకాశం ఉంది. మీడియా బిజినెస్ లో నష్టాలను తగ్గించడానికి ఇంతకుముందు కూడా సోనీ, జీ చానెల్ కంపెనీలు పలుమార్లు విలీనం కావాలని ప్రయత్నించాయి. కానీ రెండు కంపెనీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

రిలయన్స్ గ్రూప్ లో మీడియా బిజెనెస్ కోసం నెట్ వర్క్ 18 లో భాగంగా టివి 18 న్యూస్ చానెల్, స్పోర్స్ చానెల్స్, కలర్స్ టివి ఉన్నాయి. అలాగే మనీ కంట్రోల్ డాట్ కామ్, బుక్ మై షో, వివిధ మ్యాగజీన్ సంస్థలున్నాయి. ఇంగ్లీష్ లో ప్రముఖ న్యూస్ చానెల్స్ లో సిఎన్ బిసి, సిఎన్ఎన్ న్యూస్ లాంటి సంస్థలున్నాయి. ఇవే కాకుండా రిలయన్స్ కు ప్రత్యేకంగా సినీ నిర్మాణం కోసం జియో స్టూడియోస్ తోపాటు కేబుల్ డిస్ట్రీబూషన్ కోసం డెన్, హాత్ వే కంపెనీలలో మెజారిటీ వాటా ఉంది.

మరోవైపు డిస్నీకంపెనీ ఇండియాలో 2020లో ఎంట్రీ ఇచ్చింది. ట్వెంటి ఫస్ట్ సెంచురీ ఫాక్స్ ఇండియా కంపెనీని స్వాధీనం చేసుకున్నాక.. స్టార్ ఇండియా గ్రూప్ లోని హాట్ స్టార్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, స్టార్ స్పోర్టస్ చానెల్స్ అన్నీ కొనేసి.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గా అవతరించింది.

Also Read: వన్ ప్లస్ 9, 10 ప్రో ఫొన్లలో భారీ సమస్యలు.. రిపేరు ఖర్చు రూ.42000!

Related News

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Big Stories

×