BigTV English

Aadi Srinivas Vs Harishrao: ‘హరీశ్ రావుది చిట్ చాట్ కాదు.. సోది చాట్’

Aadi Srinivas Vs Harishrao: ‘హరీశ్ రావుది చిట్ చాట్ కాదు.. సోది చాట్’

MLA Aadi Srinivas Serious on Harish rao Remarks against Hydra: సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రావుపై మండిపడ్డారు. ‘హరీశ్ రావుది చిట్ చాట్ కాదు.. సోది చాట్. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి ఏం చెయ్యలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంటే ఈర్షపడ్తున్నారు. అందుకే అది చిట్ చాట్ కాదు సోది చాట్ అంటున్నా. మీరు హైడ్రా లాంటిది ఎందుకు పెట్టలేదు హరీశ్ రావు? రైతు రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో నిలిచిపోయారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పావలా పావలా ఇచ్చింది. నాలుగు సార్లు ఇచ్చింది గత ప్రభుత్వం. వరంగల్ లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. అవాక్కులు చెవాక్కులు మానేసి ప్రజా పాలనకు సహకరించండి హరీశ్ రావు.


Also Read: హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు.. నిబంధనల ప్రకారం నా ఇల్లు లేకుంటే..

మీరు మూసీ ప్రక్షాళన ఎందుకు చెయ్యలేదు? స్కిల్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీని మేం ఏర్పాటు చేస్తున్నాం. చెరువులను, నాలాలను రక్షించే పనిలో ప్రభుత్వం ఉంది. చెరువును కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను కూడా కూల్చాం. రేవంత్ ఏ పనిచేసినా మీరు ఓర్చుకోలేకపోతున్నారు. రాహుల్ గాంధీ విశ్వాసం పొందిన రేవంత్.. సీఎం అయ్యారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు. ఐటీ రంగాన్ని తెలంగాణకు పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేస్తామంటే మీరు అడ్డుపడుతున్నారు.


అయితే, కొన్ని టెక్నీకల్ సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదు. అవి కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి మాఫీ చేస్తున్నాం. నా నియోజకవర్గంలో రుణమాఫీ కాలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఈర్షద్వేషాలతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. హైడ్రా ముందు పార్టీలు, కులాలు, మతాలు లేవు. అక్రమంగా ఎవరు కట్టినా కూల్చుడే. సీఎం సోదరుడికి నోటీసులు ఇవ్వడం హర్షించదగ్గ నిర్ణయం. మంత్రి పొంగులేటి కూడా హైడ్రా పరిధిలో ఉంటే కూల్చండి అని చెప్పారు. మేము కూడా వేములవాడ నియోజకవర్గంలో హైడ్రాను ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ నేతల్లో క్లారిటీ లేదు.. వారిలో ఒకరు హైడ్రాకు మద్దతిస్తే.. మరొకరు వ్యతిరేకిస్తున్నారు. ముందుగా బీజేపీ నేతలు హైడ్రాపై అవగాహన కల్పించుకోండి. సామాన్య ప్రజలు ఐనా.. ధనవంతులైనా హైడ్రా ముందు అందరూ ఒక్కటే’ అంటూ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Also Read: హైడ్రా నోటీసుల పేరుతో డబ్బులు వసూలు.. సీరియసైన సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉంటే.. హరీశ్ రావు నేడు మీడియాతో మాట్లాడుతూ.. దేవుళ్ళ మీద ఒట్లు వేసి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇది కూల్చివేతల సర్కార్ అంటూ ఆయన మండిపడ్డారు. బుద్ధ భవన్ ఆఫీస్ హుస్సేన్ సాగర్ నాలా కింద ఉందని, హైడ్రా కమిషనర్ రంగనాత్ దాన్ని ఎందుకు కూల్చడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ముందు బుద్ధ భవన్ కూల్చి మిగిలిన వాటిని కూల్చాలంటూ ఆయన సవాల్ చేశారు. వాటిని కూల్చకుండా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆఫీస్ కులగొడుతాం అంటున్నారని మండిపడ్డారు. ఐ మ్యాక్స్, లుంబిని పార్క్, బోట్స్ క్లబ్ ఇలా అన్నీ కూల్చాలన్నారు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×