Montha on Telangana: మొంథా తుఫాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దిశ మార్చుకుని తెలంగాణపై విరుచుకుపడింది. ఈ తుపాను ముప్పు ఇంకా తొలిగిపోలేదు. వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుపాను, నెమ్మదిగా మూవ్ అవుతోంది. గడిచిన 6 గంటలుగా 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది.
తెలంగాణలో మొంథా బీభత్సం
ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిషాల మధ్య కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మంగళవారం రాత్రి నరసాపురం తీరం దాటింది మొంథా. బుధవారం తెలంగాణపై పంజా విసిరించింది. దీని దాటికి ఖమ్మం, వరంగల్ జిల్లాలు భారీ వర్షాలు కురిశాయి.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. వరంగల్ జిల్లా కల్లెడలో 34 సెంటీమీటర్లు, రెడ్లవాడ 30 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. అనేక జిల్లాల్లో చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగాయి. ఇప్పటివరకు ఒకరి మృతి చెందగా, మరొకరి గల్లంతు అయ్యారు.
చెరువును తలపించిన వరంగల్
పరిస్థితి గమనించిన ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రోడ్లు, రైల్వేస్టేషన్లు చెరువులను తలపించాయి. ఫలితంగా పలు స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు అధికారులు. చేతికి రానున్న పంటలు నీట మునిగడంతో అన్నదాత కన్నీరుమున్నీరు అవుతున్నారు.
వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు బుధవారం రాత్రి నుంచి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలలో భారీ వర్షాలు పడనున్నాయి.
ALSO READ: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?
నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు పడనున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ఇచ్చేశారు. అలాగే హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం పడే అవకాశముంది.
మరోవైపు హనుమకొండ జిల్లాలో నయింనగర్ లో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటించారు. వరద కారణంగా విద్యుత్ సరఫరా పై పరిశీలించారు. బాలసముద్రం, నయీంనగర్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ లను పరిశీలించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బందిని అభినందించారు. బ్రేక్ డౌన్ బృందాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రాత్రింబవళ్ళు పనిచేస్తూ, విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి విద్యుత్ సమస్యల కైనా 1912 లో సంప్రదించాలన్నారు.
భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరం అతలాకుతలం
నీట మునిగిన భద్రకాళి రోడ్డు వద్ద ఉన్న సరస్వతీ కాలనీ, వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డు pic.twitter.com/CPQTrgZvkU
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2025
హనుమకొండలో వరద బీభత్సం..
తుఫాన్ ఎఫెక్ట్ తో జలదిగ్బంధంలో పదుల సంఖ్యలో కాలనీలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు
రామకృష్ణ, రెవెన్యూ కాలనీ దగ్గర సహాయక చర్యలు కొనసాగిస్తున్న సుబేదారి పోలీసులు
తాళ్ళు, జెసిబి ల సహాయంతో వరద బాధితులను తరలిస్తున్న… pic.twitter.com/Xl59yJSOpV
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2025