E-Paper
Advertisement

శాంసంగ్ బిగ్ ప్లాన్.. భారత్‌లోకి ఓకేసారి 3 కొత్త ఫోన్లు ఎంట్రీ, ఫీచర్లు మాత్రం అదిరిపోయాయ్!

శాంసంగ్ బిగ్ ప్లాన్.. భారత్‌లోకి ఓకేసారి 3 కొత్త ఫోన్లు ఎంట్రీ, ఫీచర్లు మాత్రం అదిరిపోయాయ్!
Advertisement

Samsung New Phones: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ పాపులర్ బడ్జెట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను రంగంలోకి దించడానికి సిద్ధమవుతోంది. గెలాక్సీ A08 4G, గెలాక్సీ M08 4G, గెలాక్సీ F08 4G మోడల్స్ పలు అంతర్జాతీయ సర్టిఫికేషన్ సైట్లతో పాటు భారత దేశానికి చెందిన BIS వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్షమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఫోన్లు త్వరలోనే ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు స్పష్టమవుతోంది.

భారీ బ్యాటరీతో A08 4G..

తాజా సమాచారం ప్రకారం.. గెలాక్సీ A08 4G ఫోన్ బ్యాటరీ విషయంలో పెద్ద అప్‌గ్రేడ్ ఉండబోతోంది. గతంలో వచ్చిన A07లోని 5,000mAh స్థానంలో ఈసారి ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీనికి తోడు 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వెనుక వైపు రెండు కెమెరాల సెటప్‌తో పాటు డ్యూయల్ సిమ్, వైఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఇందులో రానున్నాయి.

Advertisement

Also Read: ఊహించని ట్విస్ట్.. Motorola Edge 60 Proలో ఐఫోన్ డైనామిక్ ఐలాండ్, వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

సమాన ఫీచర్లతో M08, F08..

A08తో పాటు M08 4G, F08 4G మోడల్స్ కూడా వైఫై అలైయెన్స్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్నాయి. సాధారణంగా శాంసంగ్ A సిరీస్ ఫోన్లలో ఉండే ప్రధాన హార్డ్‌వేర్‌నే కొన్ని చిన్నచిన్న మార్పులతో M, F సిరీస్‌లలో ఇస్తుంటుంది. ఈ కొత్త ఫోన్లలో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై సహా దాదాపు ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది.

అప్‌గ్రేడ్ ఫీచర్లు ఏంటి?

Advertisement

గతంలో వచ్చిన మోడల్స్ 6.7 ఇంచుల HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా, IP54 రేటింగ్‌తో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా.. సుదీర్ఘ కాలం పాటు ఓఎస్ అప్‌డేట్స్ ఆఫర్ చేశాయి. ఇప్పుడు రాబోయే కొత్త సిరీస్ కూడా అదే స్థాయిలో మెరుగైన ప్రాసెసింగ్ పవర్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే వీటి ధరలు, లాంచ్ తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఐఫోన్ యూజర్లకు మెటా సర్‌ప్రైజ్.. వాట్సప్ చాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోనుంది!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×