E-Paper
Advertisement

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!
Advertisement

Ganesh Chaturthi Photography: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలు, రంగురంగుల విద్యుత్ కాంతులు, నిమజ్జన ఊరేగింపులు.. పండుగ శోభను రెట్టింపు చేస్తాయి. అయితే రాత్రి వేళల్లో ఈ అందమైన క్షణాలను ఫోటో తీయడం కాస్త కష్టమైన పనే. తక్కువ వెలుతురు, కదిలే జనం, వెలుగుజిలుగుల వల్ల ఫోటోలు బ్లర్ అవ్వడం లేదా ఎక్కువ లైటింగ్ వచ్చి పడటం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తోనే చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ అద్భుతమైన నైట్ ఫోటోలు తీయవచ్చు. అది ఎలాగో ఈ కథనంలో చూద్దాం.

కెమెరా లెన్స్ క్లీనింగ్..

ఫోటోలు తీయడానికి ముందు మీ ఫోన్ కెమెరా గ్లాస్‌ను ఒక మెత్తటి గుడ్డతో శుభ్రంగా తుడవండి. వేలిముద్రలు, దుమ్ము ఉండటం వల్ల మండపం వెలుగుల మధ్య ఫోటోలు తీసినప్పుడు లైట్ ఫ్లేర్స్ రావడం, ఫోటోలు మసకగా కనిపించడం జరుగుతుంది. లెన్స్ శుభ్రంగా ఉంటే ఫోటోలు చాలా క్లియర్‌గా వస్తాయి.

మెయిన్ కెమెరాకే ప్రాధాన్యం

Advertisement

నైట్ టైమ్‌లో ఫోటోలు తీసేటప్పుడు అల్ట్రావైడ్ లేదా టెలిఫోటో లెన్స్ కంటే ఫోన్‌లోని ప్రైమరీ (మెయిన్) కెమెరాను వాడటమే మంచిది. మెయిన్ కెమెరా సెన్సార్ పెద్దదిగా ఉండటం వల్ల చీకటిలో కూడా ఎక్కువ వెలుతురును గ్రహించి స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

నైట్ మోడ్ ఉపయోగించండి

చీకటిగా ఉన్న ప్రదేశాల్లో ఫోటో తీస్తున్నప్పుడు నైట్ మోడ్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఇది వేర్వేరు ఎక్స్‌పోజర్లను కలిపి ఒకే ఫోటోగా మారుస్తుంది. అయితే ఫోటో వచ్చే వరకు ఫోన్‌ను కదల్చకుండా స్థిరంగా పట్టుకోవడం చాలా ముఖ్యం.

జూమ్ ఫొటోలు వద్దు

Advertisement

రాత్రి వేళల్లో డిజిటల్ జూమ్ వాడితే ఫోటో క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయి మసకగా వస్తుంది. దానికి బదులుగా స్వామివారి విగ్రహానికి వీలైనంత దగ్గరకు వెళ్లి ఫోటో తీస్తే బెటర్. లేదంటే సాధారణ ఫోటో తీసి, ఆ తర్వాత క్రాప్ (Crop) చేసుకోవడం మంచిది.

ఎక్స్‌పోజర్ సర్దుబాటు

స్వామివారి చుట్టూ ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు ఫోన్ స్క్రీన్ పై విగ్రహం భాగంలో ట్యాప్ చేసి ఎక్స్‌పోజర్‌ను కాస్త తగ్గించండి. దీనివల్ల ఎక్కువ విగ్రహం ముఖం ‘బ్లో అవుట్’ (తెల్లగా మారిపోవడం) కాకుండా స్పష్టంగా కనిపిస్తుంది.

ఫోన్ కదలకుండా పట్టుకోవడం

రాత్రి పూట తీసే ఫోటోల్లో చిన్న కదలిక ఉన్నా ఫోటో బ్లర్ అయిపోతుంది. అందుకే ఫోన్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవడం, లేదా ఏదైనా సపోర్ట్ తీసుకొని నిలబడటం చేయాలి. కుదిరితే చిన్న ట్రైపాడ్ ఉపయోగించడం ఇంకా మంచిది.

నేచురల్ లైటింగ్..

మండపంలో ఉన్న దీపాలు, చంద్రుడి వెలుతురును ఉపయోగించి ఫోటోలు తీస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది. ఆ సమయంలో ఫోన్ ఫ్లాష్‌లైట్ అస్సలు వాడకపోవడమే మంచిది. ఫ్లాష్ వేస్తే ఫోటోలు సహజత్వం కోల్పోయి ఫ్లాట్‌గా కనిపిస్తాయి.

పోర్ట్రెయిట్ మోడ్

వెలుతురు బాగున్న చోట విగ్రహం క్లోజప్ షాట్స్ కోసం ‘పోర్ట్రెయిట్ మోడ్’ వాడొచ్చు. అలాగే ప్రతి ఫోటోను నేరుగా కాకుండా.. కాస్త కింద నుంచి (Low Angle), పక్క నుంచి లేదా మొత్తం మండపం కనిపించేలా వైడ్ యాంగిల్‌లో తీస్తే ఫోటోలు చాలా బాగా వస్తాయి.

బర్స్ట్ మోడ్ ఫీచర్

నిమజ్జనం, డ్యాన్సులు, ఊరేగింపుల సమయంలో జనం కదులుతుంటారు కాబట్టి ‘బర్స్ట్ మోడ్’ (Burst Mode) లేదా మోషన్ ఫీచర్ వాడాలి. దీనివల్ల ఒకేసారి ఎక్కువ ఫోటోలు క్యాప్చర్ అయ్యి.. అందులో పర్ఫెక్ట్ షార్ప్ ఫోటోను ఎంచుకోవడానికి వీలవుతుంది.

Also Read: ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

ఎడిటింగ్ మర్చిపోవద్దు..

ఫోటోలు తీసాక ఫోన్‌లోని బ్రైట్‌నెస్, షాడోస్, కలర్స్ కాస్త అడ్జస్ట్ చేస్తే ఫోటో మరింత గ్రాండ్‌గా కనిపిస్తుంది. అయితే అతిగా షార్ప్‌నెస్ లేదా కలర్ పెంచితే ఫోటో కృత్రిమంగా మారి సహజత్వం కోల్పోతుంది. మెుత్తంగా ఈ చిన్నపాటి మెళకువలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌తోనే వినాయక చవితి జ్ఞాపకాలను ఎంతో అందంగా ఫోన్ లో బంధించవచ్చు.

Also Read: భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

Tags

Related News

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

పాన్ కార్డ్ పోయిందా? టెన్షన్ వద్దు! నిమిషాల్లో ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

Big Stories

Advertisement
×