Toshiba 50E350SP 4K TV: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంట్లోనే కూర్చుని సినిమా థియేటర్ ఫీల్ పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకే పెద్ద స్క్రీన్ గల 4K స్మార్ట్ టీవీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రముఖ టెక్ బ్రాండ్ టోషిబా నాణ్యమైన ప్రొడక్ట్స్‌తో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన ‘Toshiba 50E350SP’ 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ టీవీ టెక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కేవలం రూ. 33,990 ధర కేటగిరీలో లభిస్తున్న ఈ 50 ఇంచుల టీవీ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ టీవీ చూడటానికి చాలా సన్నని బెజెల్స్‌తో, మోడర్న్ లుక్‌లో హాల్‌కు మంచి లుక్ ఇస్తుంది. ఇందులో 126 సెం.మీ (50 ఇంచుల) సైజ్ గల 4K అల్ట్రా హెచ్‌డీ (3840×2160 పిక్సెల్స్) డిస్‌ప్లేను అందించారు. పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా, రంగులు చాలా సహజంగా కనిపిస్తాయి. డాల్బీ విజన్, HDR10 సపోర్ట్ ఉండటం వల్ల నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో సినిమాలను చూసేటప్పుడు విజువల్స్ వేరే లెవెల్ ఫీల్ ఇస్తాయి.
ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా, సింపుల్‌గా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూ ట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లు ఈజీగా అందుబాటులో ఉంటాయి. బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీని ద్వారా వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
కేవలం పిక్చర్ క్వాలిటీనే కాకుండా సౌండ్ విషయంలోనూ.. టోషిబా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ స్పీకర్లను వాడారు. అదనపు హోమ్ థియేటర్ అవసరం లేకుండానే.. ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ స్పష్టంగా, లౌడ్‌గా వినిపిస్తాయి. మ్యూజిక్ లవర్స్ కు ,సినిమా అభిమానులకు ఈ ఆడియో ఫీల్ ఎంతగానో నచ్చుతుంది.
Also Read: రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్
గేమింగ్ కన్సోల్స్, సెట్-టాప్ బాక్సులు, పెన్ డ్రైవ్‌లను కనెక్ట్ చేసుకోవడానికి ఇందులో పలు రకాల పోర్ట్‌లను ఇచ్చారు. HDMI పోర్ట్‌లు, USB పోర్ట్‌లతో పాటు వైఫై , బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ ఆడేవారికి కూడా ఈ టీవీ మంచి సపోర్ట్ ఇస్తుంది.
రూ.35వేల లోపు బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, 4K విజువల్స్, అద్భుతమైన సౌండ్, గూగుల్ టీవీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. మీ ఇల్లు లేదా లివింగ్ రూమ్‌ను మినీ థియేటర్‌లా మార్చుకోవడానికి ఈ స్మార్ట్ టీవీ బెస్ట్ అని చెప్పొచ్చు.