E-Paper
Advertisement

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!
Advertisement

iNFiRe Fusion 12W: ప్రస్తుత కాలంలో మ్యూజిక్ వినడానికి కేవలం పెద్ద పెద్ద హోమ్ థియేటర్లే కాకుండా.. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లగల పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రయాణాలు చేసేటప్పుడు, చిన్న పాటి గెట్ టుగెదరింగ్లో లేదా ఇంట్లో రిలాక్స్ అయ్యే సమయంలో మంచి మ్యూజిక్ ప్లే చేయడానికి ఒక బెస్ట్ స్పీకర్ ఉండటం చాలా అవసరం. ప్రముఖ ఆడియో బ్రాండ్ నుంచి వస్తున్నఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. రూ. 847 ధర కేటగిరీలో లభిస్తున్న ఈ అక్వా బ్లాక్ స్పీకర్ టెక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.అట్రాక్టివ్ డిజైన్ ,అక్వా బ్లాక్ లుక్:

ఈ స్పీకర్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది.’అక్వా బ్లాక్’ కలర్ వేరియంట్ దీనికి మోడర్న్ లుక్‌ను ఇస్తుంది. బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల.. దీన్ని మీ బ్యాగ్‌లో లేదా చేతిలో పట్టుకుని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. చిన్న ట్రిప్స్‌కి వెళ్లే వారికి, అవుట్‌ డోర్ పిక్నిక్‌లకి ఇది పర్ఫెక్ట్ ట్రావెలింగ్ కంపానియన్‌లా పని చేస్తుంది.

2.12W పవర్‌ ఫుల్ స్టీరియో సౌండ్:

Advertisement

ఇంత చిన్న సైజులో లభిస్తున్నప్పటికీ.. ఇది ఏకంగా 12 వాట్ల పవర్‌ ఫుల్ సౌండ్ అవుట్‌ పుట్‌ను అందిస్తుంది. స్టీరియో ఛానల్ సపోర్ట్ ఉండటం వల్ల పాటలు వినేటప్పుడు వాయిస్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా, బీట్స్ గట్టిగా వినిపిస్తాయి. చిన్న పాటి రూమ్ పార్టీలు లేదా ఇండోర్ గ్యాదరింగ్స్‌లో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఈ పవర్ సరిగ్గా సరి పోతుంది.

3.TWS, మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్:

ఈ బడ్జెట్‌లోనూ.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించడం దీని ప్రత్యేకత. ఇందులో ట్రూ వైర్‌లెస్ స్టీరియో టెక్నాలజీ ఉంది. దీని ద్వారా మరో .. ఇదే రక మైన స్పీకర్‌ను కనెక్ట్ చేసి డబుల్ సౌండ్ ఎక్స్‌ పీరియెన్స్‌ను పొందవచ్చు. కేవలం బ్లూటూత్ ద్వారానే కాకుండా.. యూఎస్బీ డ్రైవ్, ఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఇందులో ఇవ్వడం విశేషం. మొబైల్‌తో పని లేకుండా నేరుగా పెన్ డ్రైవ్ లేదా మెమరీ కార్డ్ ద్వారా కూడా మీకు నచ్చిన పాటలను ప్లే చేసుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

4. బ్యాటరీ బ్యాకప్:

బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది దాదాపు 8 గంటల పాటు నిరంతరం నాన్‌ స్టాప్ ఎంటర్‌ టైన్‌మెంట్‌ను అందిస్తుంది. అంటే.. రోజంతా ప్రయాణాల్లో లేదా చిన్నపాటి ఈవెంట్లలో ఎలాంటి బ్యాటరీ టెన్షన్ లేకుండా దీన్ని హ్యాపీగా వాడొచ్చు. ఛార్జింగ్ కూడా త్వరగా పూర్తవుతుంది.

రూ. 850 లోపు బడ్జెట్‌లో ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ 12W సౌండ్, మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ కోరుకునే వారికి ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక సూపర్ ఆప్షన్. చిన్నపాటి బడ్జెట్‌లో బెస్ట్ మ్యూజిక్ ఫీల్ పొందడానికి ఈ స్పీకర్ కచ్చితంగా సరి పోతుంది!

Related News

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

పాన్ కార్డ్ పోయిందా? టెన్షన్ వద్దు! నిమిషాల్లో ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

సైబర్ కేటుగాళ్ల కొత్త డ్రామా..ఫేక్ ఆఫర్లతో మీ అకౌంట్ ఖాళీ!

Big Stories

Advertisement
×