E-Paper
Advertisement

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?
Advertisement

128GB vs 256GB storage: మార్కెట్లో ఏ కొత్త స్మార్ట్‌ ఫోన్ లాంచ్ అయినా బేసిక్ వేరియంట్ 128GB తో వస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం 64GB లేదా 128GB అంటే చాలా పెద్ద విషయంగా అనిపించేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఫోటోలు, హై-ఎండ్ వీడియోలు, భారీ యాప్‌లు, మొబైల్ గేమ్‌ల సైజు విపరీతంగా పెరిగిపోయింది. దీని వల్ల 128GB స్టోరేజ్ ఉన్న ఫోన్‌లు త్వరగా నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. యూజర్లు తమ డివైజ్‌లలో ఎక్కువ డేటాను లోకల్‌గా స్టోర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి మీ అవసరాలకు ఏ స్టోరేజ్ సరిగ్గా సరిపోతుందో తెలుసుకుందామా..

128GB స్టోరేజ్ ఎవరికి బెస్ట్?

మీరు రోజూ వాట్సాప్ చాట్లు, సోషల్ మీడియా యాప్స్ (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్), సాధారణ ఫోటోలు, యూ ట్యూబ్ వాచింగ్ కోసం మాత్రమే ఫోన్‌ను ఎక్కువగా వాడుతుంటే.. 128GB సరి పోతుంది. క్లౌడ్ స్టోరేజ్ (గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్) రెగ్యులర్‌గా వాడే వారికి, పెద్ద పెద్ద గేమ్‌లు ఆడని వారికి 128GB బడ్జెట్ పరంగా చాలా మంచి ఆప్షన్. తక్కువ బడ్జెట్‌లో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. అయితే.. వీడియోలు ఎక్కువగా రికార్డ్ చేసేవారికి ఇది త్వరగా నిండే అవకాశం ఉంది.

256GB స్టోరేజ్ ఎందుకు అవసరం?

Advertisement

మీరు ఫోన్‌లో.. 4K వీడియోలు రికార్డ్ చేయడం, పబ్జీ లేదా కాల్ ఆఫ్ డ్యూటీ వంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం చేస్తుంటే.. కచ్చితంగా 256GB లేదా అంత కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండాల్సిందే. అలాగే సినిమాలను ఆఫ్‌ లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని చూసే వారికి, వందలాది హై-క్వాలిటీ ఫోటోలు ఫోన్‌లోనే.. ఉంచుకునే వారికి 128GB త్వరగా ఫుల్ అయిపోతుంది. ప్రస్తుత కాలంలో.. యాప్‌ల అప్‌ డేట్స్ సైజు కూడా భారీగా పెరుగడం వల్ల, రాబోయే 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఫోన్‌ను ఎలాంటి స్టోరేజ్ సమస్య లేకుండా వాడాలంటే 256GB తీసుకోవడం బెస్ట్.

Also Read: సైబర్ కేటుగాళ్ల కొత్త డ్రామా..ఫేక్ ఆఫర్లతో మీ అకౌంట్ ఖాళీ!

Advertisement

కొత్త ఫోన్ కొనేటప్పుడు.. మీ బడ్జెట్ ఒక్కటే కాకుండా.. మీ లాంగ్ టర్మ్ యూసేజ్ ఎలా ఉంటుందనేది కూడా చెక్ చేయాలి. మీరు ఒక సారి ఫోన్ కొన్నాక స్టోరేజ్ పెంచుకోవడం కష్టం కాబట్టి, కొంచెం అదనంగా ఖర్చుపెట్టి 256GB వేరియంట్‌ని ఎంచుకోవడం భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. మీ అవసరానికి తగిన సరైన స్టోరేజ్‌ని సెలెక్ట్ చేసు కొని మీ స్మార్ట్‌ ఫోన్ అనుభవాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి!

Related News

పాన్ కార్డ్ పోయిందా? టెన్షన్ వద్దు! నిమిషాల్లో ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

సైబర్ కేటుగాళ్ల కొత్త డ్రామా..ఫేక్ ఆఫర్లతో మీ అకౌంట్ ఖాళీ!

అంతరిక్షంలో ‘ఫుట్‌బాల్’.. బంతితో చెడుగుడు ఆడిన వ్యోమగాములు.. అదరగొట్టారు భయ్యా!

నెక్స్ట్ లెవెల్ ఆడియో వైబ్స్..అమెజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఇయర్‌బడ్స్

ఇంట్లో కరెంట్ లేకపోయినా.. మెుబైల్ ఛార్జింగ్ పెట్టొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వైబ్స్ మారాలంటే ఈ స్పీకర్ ఉండాల్సిందే.. రూ.1199కే క్రేజీ సౌండ్

ఏడాది పాటు 5G డేటా, కాల్స్, ఓటీటీ కావాలా? Airtel, Jio, Viలో అత్యుత్తమ ప్లాన్స్ ఇవే.. వర్త్ వర్మా వర్త్!

Big Stories

Advertisement
×