Jlab JBuds LUX ANC: టెక్ మార్కెట్లో హెడ్ ఫోన్స్, ఆడియో డివైజెస్‌లకు రోజు రోజుకూ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసేవారు, ఆఫీసుల్లో ఎక్కువ సేపు వర్క్ చేసే వారు మంచి కంఫర్ట్ , లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే హెడ్ సెట్‌లను కోరుకుంటున్నారు. ప్రముఖ ఆడియో బ్రాండ్ Jlab నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ హెడ్‌సెట్ ఈ కోవకే చెందుతుంది. రూ.5,999 ధర కేటగిరీలో .. లభిస్తున్న ఈ గ్రాఫైట్ కలర్ ఆన్-ది-ఇయర్ హెడ్ సెట్ టెన్షన్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్ టైన్‌మెంట్‌ను అందిస్తుంది. ఈ మోడల్ స్పెషల్ ఫీచర్లు ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హెడ్‌సెట్ చూడటానికి చాలా క్లాసీగా, మోడర్న్‌గా ఉంటుంది.’గ్రాఫైట్’కలర్ వేరియంట్ దీనికి మరింత రిచ్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. ఆన్-ది-ఇయర్ డిజైన్‌తో రూపొందించిన ఈ హెడ్ ఫోన్స్ చెవులపై ఒత్తిడి ఎక్కువగా పడకుండా చాలా సాఫ్ట్‌గా సెట్ అవుతాయి. ఎక్కువ గంటలు తలపై పెట్టుకున్నప్పటికీ ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగకుండా డిజైన్ చేశారు. ప్రయాణాల్లో దీన్ని ఈజీగా మడతపెట్టి బ్యాగ్‌లో సర్దుకోవచ్చు.
ఈ హెడ్ సెట్‌లో అత్యంత ముఖ్యమైన హైలైట్ ‘యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్’టెక్నాలజీ. బయటి ప్రపంచం నుంచి వచ్చే అనవసరమైన ట్రాఫిక్ సౌండ్స్, జనాల గోల వంటి వాటిని ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీని వల్ల రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పటికీ మీరు వినే పాటలు లేదా అటెండ్ అయ్యే ఆఫీస్ మీటింగ్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్పష్టంగా వినిపిస్తాయి.
సాధారణ హెడ్ ఫోన్స్‌తో పోలిస్తే.. బ్యాటరీ విషయంలో ఈ మోడల్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ANC ఆన్ చేసి లేదా ఆఫ్ చేసి వాడే విధానాన్ని.. బట్టి ఇది ఏకంగా 70 గంటల వరకు నిరంతరం బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన పనే ఉండదు. రోజంతా ప్రయాణాలు చేసే వారికి, తరచూ ఛార్జింగ్ టెన్షన్ పడే వారికి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్.
Also Read: రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్
ఇందులో ఉన్న మల్టీ-కనెక్టివిటీ ఆప్షన్ ద్వారా ఒకే సమయంలో .. రెండు వేర్వేరు డివైజెస్‌కు (ఉదాహరణకు లాప్‌టాప్, స్మార్ట్ ఫోన్) హెడ్ సెట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. లాప్ టాప్‌లో వర్క్ చేస్తూనే సడన్‌గా.. ఫోన్‌కు కాల్ వస్తే ఎలాంటి మ్యాన్యువల్ స్విచ్చింగ్ లేకుండా ఇరు వైపులా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు.
రూ. 5,999 బడ్జెట్‌లో ప్రీమియం సౌండ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, పవర్ ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్ కోరుకునే వారికి .. ఈ మోడల్ ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. మీ మ్యూజిక్ ఫీల్, డైలీ వర్క్ కమ్యూనికేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి మార్చుకోవడానికి ఈ హెడ్ సెట్ పర్ఫెక్ట్‌గా సరి పోతుంది.