E-Paper
Advertisement

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే
Advertisement

GOBOULT Saber smartwatch: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్ వాచ్ కేవలం టైం చూడటానికే కాకుండా.. మన ఫిట్‌నెస్‌ను, రోజువారీ అలవాట్లను ట్రాక్ చేయడానికి ఒక ముఖ్యమైన గార్జెట్‌గా మారిపోయింది. అందులోనూ.. తక్కువ ధరలో ప్రీమియం వాచ్‌లను అందించడంలో బౌల్ట్ బ్రాండ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ‘GOBOULT Saber’ స్మార్ట్ వాచ్ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటోంది.ఈ ట్రెండీ స్మార్ట్ వాచ్ అందించే ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

ప్రీమియం డిజైన్,డిస్‌ప్లే:

ఈ స్మార్ట్ వాచ్ లుక్ పరంగా.. చూడటానికి చాలా ఖరీదైన వాచ్‌లా అనిపిస్తుంది. ఇందులో.. 1.43 ఇంచుల పెద్ద అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని.. 466×466 పిక్సెల్ రెజుల్యూషన్ , 700 నిట్స్ బ్రైట్‌ నెస్ వల్ల ఎండలో.. బయటికి వెళ్లినా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే.. ఇందులో ‘ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే’ఫీచర్ కూడా ఉంది. దీనికి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచే అంశం ఏంటంటే.. ఇందులో ఇచ్చిన ‘ఫంక్షనల్ రొటేటింగ్ బెజెల్’. దీని ద్వారా మెనూలను నావిగేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. జింక్ అలాయ్ ఫ్రేమ్‌తో ఇది చాలా దృఢంగా తయారు చేయబడింది.

బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ ఫీచర్స్:

Advertisement

ఈ వాచ్ ద్వారా ఫోన్ చేతిలో.. లేకపోయినా నేరుగా మణికట్టు మీదుగా కాల్స్ మాట్లాడే అవకాశం ఉంది. సింగిల్ చిప్ బ్లూటూత్ v5.3 కనెక్టివిటీ ఉండటం వల్ల కాల్స్ చాలా స్టేబుల్‌గా వస్తాయి. బిల్ట్-ఇన్ మైక్, స్పీకర్ క్వాలిటీ చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఏఐ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. 200కి పైగా క్లౌడ్, కస్టమ్ వాచ్ ఫేస్‌లతో మీ మూడ్‌కి తగ్గట్టు వాచ్ లుక్‌ను మార్చుకోవచ్చు.

హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారి కోసం ఇందులో.. అడ్వాన్స్‌డ్ హెల్త్ సెన్సార్లు ఉన్నాయి.హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ , బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్ లెవెల్స్‌ను ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంది. వీటితో పాటు స్లీప్ మానిటర్, వాటర్ డ్రింక్ రిమైండర్, మెడిటేషన్ మోడ్ వంటివి ఉన్నాయి. అలాగే వివిధ రకాల ఆటలు, వ్యాయామాల కోసం ఏకంగా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో ఉంచారు.

Advertisement

Also Read: రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

బ్యాటరీ బ్యాకప్, వాటర్ రెసిస్టెన్స్:

బ్యాటరీ విషయానికి వస్తే, సాధారణ వాడకంలో ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 7 రోజుల వరకు నాన్‌ స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో త్వరగా ఛార్జ్ అవుతుంది. ఇది IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. కాబట్టి వర్షంలో లేదా చెమట పట్టినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.

రూ. 3,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం అమోలెడ్ స్క్రీన్, రొటేటింగ్ బెజెల్ , కాలింగ్ ఫీచర్ కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్. మీ స్టైల్‌ను, ఫిట్‌నెస్‌ను నెక్స్ట్ లెవెల్‌కి మార్చుకోవడానికి ఈ స్మార్ట్ వాచ్ పర్ఫెక్ట్‌ అని చెప్పొచ్చు.

Related News

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

పాన్ కార్డ్ పోయిందా? టెన్షన్ వద్దు! నిమిషాల్లో ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

Big Stories

Advertisement
×