E-Paper
Advertisement

ఐఫోన్ యూజర్లకు మెటా సర్‌ప్రైజ్.. వాట్సప్ చాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోనుంది!

ఐఫోన్ యూజర్లకు మెటా సర్‌ప్రైజ్.. వాట్సప్ చాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోనుంది!
Advertisement

WhatsApp Chat Bubbles: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. తమ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఐఫోన్ వాడుతున్న వారి కోసం మెసేజింగ్ ఇంటర్‌ఫేస్‌లో ఒక ఆసక్తికరమైన మార్పును టెస్ట్ చేస్తోంది. చాట్ విండోలో మెసేజ్ బబుల్స్ డిజైన్‌ను మారుస్తూ.. మరింత ఆధునికమైన లుక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

న్యూ లుక్‌లో చాట్ బబుల్స్..

ప్రస్తుతం కొందరు బీటా వెర్షన్ యూజర్లకు ఈ కొత్త డిజైన్ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న మూలలు పదునుగా ఉండే బబుల్స్ స్థానంలో, ఇప్పుడు రౌండెడ్ మూలలతో చాలా సాఫ్ట్‌గా కనిపిచేలా వీటిని డిజైన్ చేశారు. యాపిల్ తమ ఐఓఎస్‌లో ఉపయోగిస్తున్న సరికొత్త డిజైన్ శైలికి సరిపోయేలా ఈ మార్పులు ఉన్నాయి. దీనివల్ల చాట్ డిజైన్ చూడటానికి చాలా సింపుల్‌గా, ముచ్చటగా అనిపిస్తుంది.

Advertisement

Also Read: Vi క్రేజీ ప్లాన్.. రూ.200 రీఛార్జ్ చేస్తే చాలు.. 20 ఓటీటీలు, 200 ఛానెళ్లు ఉచితం!

మీడియా షేరింగ్‌లో మార్పులు..

కేవలం టెక్ట్స్ మెసేజ్‌లు మాత్రమే కాకుండా.. చాట్‌లో పంపే ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ల రూపంలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పాత డిజైన్‌లో ఇమేజ్‌ల చుట్టూ ఉండే లైన్లు లేదా ఫ్రేమ్‌లను తొలగించారు. దీనివల్ల మనం పంపే ఫొటోలు, వీడియోలు స్క్రీన్‌పై చాలా స్పష్టంగా, ఎలాంటి బోర్డర్లు లేకుండా నేరుగా చాట్‌లో కలిసిపోయినట్లు కనిపిస్తాయి.

బీటా యూజర్లకు అందుబాటులో..

Advertisement

ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ బీటా వెర్షన్ ఉపయోగిస్తున్న కొద్దిమంది ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, కొందరు సాధారణ యాప్ స్టోర్ యూజర్లకు కూడా ఇది కనిపిస్తున్నట్లు సమాచారం. మెటా సంస్థ దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న టెస్టింగ్ పూర్తయ్యాక కొద్ది వారాల్లోనే సాధారణ యూజర్లందరికీ ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరికొన్ని సరికొత్త ఫీచర్లు..

కేవలం ఈ లుక్ మాత్రమే కాకుండా.. వాట్సప్ మరికొన్ని ఉపయోగకరమైన ఫీచర్లపై కూడా పనిచేస్తోంది. ముఖ్యంగా ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కేవలం యూజర్‌నేమ్‌తో చాట్ చేసే సదుపాయం, అలాగే టూ-స్టెప్ వెరిఫికేషన్ PIN స్థానంలో పాస్‌వర్డ్ పెట్టుకునే వెసులుబాటును కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది.

Also Read: అబ్బో.. Wi-Fi పాస్‌వర్డ్ లేకుండా కనెక్ట్ అవ్వడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయా?

Related News

వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

Big Stories

Advertisement
×