E-Paper
Advertisement

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్
Advertisement

CMF by Nothing Buds 2a: టెక్‌ మార్కెట్‌లో ప్రస్తుతం డిజైన్, పెర్ఫార్మెన్స్‌ పరంగా సంచలనం సృష్టిస్తున్న బ్రాండ్‌లలో CMF ఒకటి. నథింగ్ సంస్థ అందించే ప్రత్యేకమైన డిజైన్ లాంగ్వేజ్‌ను ఇష్ట పడే యూత్ కోసం ఈ బ్రాండ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా విడుదలైన ‘CMF by Nothing Buds 2a’ ఆడియో డివైజ్ కేవలం రూ.2,399 ధరకే లభిస్తుండటంతో టెక్ లవర్స్‌లో భారీ క్రేజ్ సంతరించుకుంది. బడ్జెట్ ధరలో లభించే హై-ఎండ్ ఫీచర్లు గల ప్రొడక్ట్స్‌కు.. అద్భుతమైన రీచ్ లభిస్తోంది. ఈ ట్రెండీ ఇయర్‌ బడ్స్ అందించే ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. డిజైన్, కలర్ వైబ్స్:

CMF గార్జెట్స్ ప్రత్యేకత వాటి స్పెషల్ డిజైన్.ముఖ్యంగా ఇందులో అందించిన ‘ఆరెంజ్ కలర్ వేరియంట్ చూడటానికి చాలా ట్రెండీగా, యూత్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. మ్యూజిక్ వింటూనే స్టైలిష్‌గా కనిపించాలనుకునే.. వారికి ఈ కలర్ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. తక్కువ బరువుతో ఉండే.. ఈ ఇయర్‌ బడ్స్ చెవిలో పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా కంఫర్టబుల్‌గా ఫిట్ అవుతాయి.

2.సౌండ్ క్వాలిటీ, బేస్ పవర్:

Advertisement

ఈ బడ్జెట్‌లో ఇది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో పవర్ ఫుల్ 12.4mm డ్రైవర్‌ను వాడారు. దీనికి తోడు ‘Dirac-tuned’ ఆడియో టెక్నాలజీ , ‘అల్ట్రా బాస్ టెక్నాలజీ’ ఉండటం వల్ల మ్యూజిక్ వినేటప్పుడు బీట్స్ చాలా స్పష్టంగా, డీప్‌గా వినిపిస్తాయి. రాక్ మ్యూజిక్ లేదా పాప్ సాంగ్స్ ఇష్ట పడే వారికి బాస్ లెవెల్స్ వేరే లెవెల్‌లో ఫీల్ అందిస్తాయి.

3. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ :

బడ్జెట్ ధరలో.. లభిస్తున్నప్పటికీ ఇందులో ఏకంగా 42 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందించారు. రద్దీగా ఉండే.. మెట్రో ప్రయాణాల్లో, బస్సుల్లో లేదా ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు బయటి అనవసరమైన సౌండ్స్‌కు ఇది సమ ర్థవంతంగా అడ్డుకుంటుంది. దీని వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు లేదా క్లియర్‌ గా కాల్స్ మాట్లాడొచ్చు.

Advertisement

Also Read: కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

4.బ్యాటరీ బ్యాకప్ కనెక్టివిటీ:

బ్యాటరీ విషయానికి వస్తే.. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది దాదాపు 35.5 గంటల పాటు నిరంతరం నాన్‌ స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా టెన్షన్ లేకుండా వాడొచ్చు. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో కొద్ది సేపు ఛార్జ్ చేస్తే.. చాలు ఎక్కువ సేపు బ్యాకప్ వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ చాలా ఫాస్ట్‌గా ఉండి, డివైజ్‌తో తక్షణమే పేర్ అవుతుంది.

రూ. 2,300 ప్రైస్ రేంజ్‌లో ప్రీమియం ఫీచర్లు, అదిరి పోయే లుక్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కోరు కునే వారికి..ఈ మోడల్ ఒక బెస్ట్ ఆప్షన్. మీ ఆడియో ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ల డానికి ఈ ట్రెండీ ఇయర్‌ బడ్స్ చాలా బాగా ఉపయోగ పడతాయి.

Related News

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

పాన్ కార్డ్ పోయిందా? టెన్షన్ వద్దు! నిమిషాల్లో ఈ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

సైబర్ కేటుగాళ్ల కొత్త డ్రామా..ఫేక్ ఆఫర్లతో మీ అకౌంట్ ఖాళీ!

అంతరిక్షంలో ‘ఫుట్‌బాల్’.. బంతితో చెడుగుడు ఆడిన వ్యోమగాములు.. అదరగొట్టారు భయ్యా!

నెక్స్ట్ లెవెల్ ఆడియో వైబ్స్..అమెజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఇయర్‌బడ్స్

Big Stories

Advertisement
×