Samsung Galaxy M55s 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ గ్లోబల్ వైడ్‌గా దూసుకుపోతుంది. కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక దేశీయ మార్కెట్‌లో సైతం తన సత్తా చూపిస్తోంది. ఎన్నో రకాల మోడళ్లను లాంచ్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరికొన్ని మొబైల్స్‌ను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అందులో Samsung Galaxy M55s 5G ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల అంటే సెప్టెంబర్ 23న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ క్రమంలో కంపెనీ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీతో పాటు, కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను వెల్లడించింది.
Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ సూపర్ AMOLED+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రైమరీ రియర్ కెమెరా సపోర్టింగ్ OISతో వస్తుంది. అంతే కాకుండా ఈ M-సిరీస్ ఫోన్‌లో స్టైలిష్ ఫ్యూజన్ డిజైన్‌ను అమర్చనున్నట్లు Samsung పేర్కొంది. అదే సమయంలో ఒక భారతీయ టిప్‌స్టర్ Samsung Galaxy M55Sకి సంబంధించిన ఫొటోలను షేర్ చేసి స్పెసిఫికేషన్‌లను లీక్ చేశారు. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 23న భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది. దీని ద్వారా హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలను షూట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉన్నట్లు ప్రకటించారు.
ఈ కెమెరా సిస్టమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో వస్తుంది. అదే సమయంలో Samsung ప్రకారం.. Galaxy M55s 5G సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాలను ఒకేసారి ఉపయోగించి వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా Galaxy M55s 5Gలో వినియోగదారులు Nightography ఫీచర్‌ను కూడా పొందుతారు. ఈ ఫీచర్ నైట్ టైమ్ ఫోటోగ్రఫీకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!
Samsung Galaxy M55s 5G ఫోన్ స్టైలిష్ ఫ్యూజన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED+ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ ఫోన్ విజన్ బూస్టర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తమ ఫోన్‌లోని మెసేజ్ లేదా ఇతర కంటెంట్‌ను బ్రైట్‌నెస్‌గా మండుట ఎండలో అయినా చూడగలరు. ఇది మాత్రమే కాకుండా గెలాక్సీ M55s 5G కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇది కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
కాగా దీనిని Amazon, Samsung.com, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని Samsung వెల్లడించింది. ఇక Samsung Galaxy M55s ఫోన్‌లో Qualcomm Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌లో 8GB RAM + 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను అందించినట్లు సమాచారం. దీని కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి. ఇక దీని ధర విషయానికొస్తే.. Samsung Galaxy M55s దాదాపు రూ. 20,000 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది.