Bigg Boss 8 Day 18 Promo : బిగ్ బాస్ (Bigg Boss) ఎనిమిదవ సీజన్ లో భాగంగా 18వ రోజుకు సంబంధించి తాజాగా ప్రోమోని విడుదల చేయగా ప్రోమో చూసిన ఆడియన్స్.. హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా జరిగిన ప్రోమోలో ఎప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తూ.. విష్ణు ప్రియ, యష్మి లను టార్గెట్ చేస్తూ వస్త్రధారణ పై విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్న సోనియాకి నబీల్ ఝలక్ ఇచ్చాడని చెప్పవచ్చు.
సోనియా కు ఝలక్ ఇచ్చిన నబీల్..
ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో సంచాలక్ గా వ్యవహరిస్తున్న నబీల్.. నిఖిల్, పృథ్వీ, సోనియాలతో మాట్లాడుతూ.. గడ్డి కింద దాచిపెట్టిన గుడ్లన్నీ.. గడ్డిమీద పెట్టండి అంటూ నబీల్ చెప్పగా.. దీనికి సోనియా మాట్లాడుతూ.. చదువు రూల్ అంటూ వాయిస్ రైస్ చేసి మాట్లాడింది. కనపడాలి అని దాంట్లో రూల్ ఉంది.. దాచి పెట్టకూడదు అని రూలేమీ లేదు అంటూ మాట్లాడింది దీంతో నబీల్ బెదిరించకు. బెదిరించినట్టు అనిపిస్తోంది మంచిగా అడుగు నేను చెప్తున్నాను కదా అంటూ ఒక్క మాటతో ఆమె నోరు మూయించాడు. దాంతో సైలెంట్ అయిపోయింది సోనియా.
యష్మీ – నిఖిల్ మధ్య యుద్ధం..
ఇక తర్వాత ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో కంటెస్టెంట్స్ ఎవరికి వారు పోటీపడుతూ గుడ్లు సేకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత యష్మీ మాట్లాడుతూ.. సంచాలక్ రూల్ బ్రేక్ చేశారు అంటూ గట్టిగా అరుస్తుంది. వాళ్లు రూల్ బ్రేక్ చేసినప్పుడు మేమెందుకు రూల్ బ్రేక్ చేయలేదు అంటూ యష్మి ప్రశ్నించింది. కాన్సెంట్రేట్ చేయండి ముందు మీరు.. మేం చూసుకుంటాం అంటూ నిఖిల్ యష్మితో వాదించాడు. ఆ తర్వాత నిఖిల్ గుడ్లు లాకెళ్లి తన టీమ్ లో వేసేసాడు. ఆ తర్వాత నిఖిల్ – యష్మీ మధ్య గొడవ తారస్థాయికి చేరిపోయింది.
బిగ్ డ్రామా..
ఇక యష్మితో అభయ్ మాట్లాడుతూ.. ఫిజికల్ టాస్క్ వాళ్లే మొదలుపెట్టారు కదా అదేంటి అంటూ ఆమెతో డిస్కషన్ పెడతాడు. ఇక తర్వాత గుడ్లు కలెక్ట్ చేసే సమయంలో సోనియా తనను గట్టిగా పట్టుకొని లాగేసిందంటూ ప్రేరణ పృథ్వితో చెబుతుంది. ఇక నబీల్.. సీతతో సోనియా ప్రవర్తన గురించి చెబుతూ.. ఆమె ఏమన్నా డాన్ అనుకుంటోందా.. బిగ్ బాసా.. మంచిగా మాట్లాడితే నేను కూడా అంది అంటూ మంచిగా మాట్లాడుతాను కదా అంటూ సీతతో చెప్పుకుంటాడు. మొత్తానికి అయితే సోనియా కి నబీల్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి అయితే ఎవరికి వారు వాదనలాడుకుంటూ.. తమ స్ట్రాటజీ చూపించే ప్రయత్నం చేశారు ఇక ఈ ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో ఏ క్లాన్ గెలిచిందో తెలియాలంటే ఇంకొద్దిసేపు ఆగాల్సిందే. ఏదేమైనా హౌస్లో పెద్ద డ్రామా నడుస్తోందని చెప్పవచ్చు.