BigTV English

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Flipkart Big Billion Days Sale 2024: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అలాంటి ఆఫర్ల కోసం తెగ సెర్చ్ చేసేస్తుంటారు. మరి మీరు కూడా ఎప్పట్నుంచో అలాంటి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే బెటర్ అవకాశం. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిఫ్‌కార్ట్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త సేల్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చి అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త సేల్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.


సంస్థ తన కొత్త ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024ని సెప్టెంబర్ 27 నుండి అందుబాటులో ఉంచనుంది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు 24 గంటల ముందు అంటే సెప్టెంబర్ 26న ఈ సేల్‌ ప్రయోజనం పొందుతారు. ఇక ఈ సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలతో సహా ఇతర ప్రొడక్టులపై భారీ తగ్గింపులను పొందుతారు. అందులో గూగుల్ పిక్సెల్ 8, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 వంటి మొబైల్స్ ఆకర్షణీయమైన తగ్గింపులతో సేల్‌లో లభిస్తాయి. మరి ఈ సేల్‌లో తగ్గింపు ధరలలో కొనుక్కోగలిగే మొబైల్ ఏవి?.. వేటిపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి? బ్యాంక్ ఆఫర్లు వంటి ఇతర వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపులు


ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్లతో లభించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల ఆన్-సేల్ ధరలను వెల్లడించింది. అందులో Google Pixel 8 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర రూ.75,999 ఉండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,000  కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చని తెలుస్తోంది. అదేసమయంలో Samsung Galaxy S23 మొబైల్ విషయానికొస్తే.. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.74,999కి అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 40 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Also Read:  హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఫైనల్ ధర తెలియరాలేదు. ఇది కాకుండా Samsung Galaxy S23 FE బేస్ వేరియంట్ అసలు ధర వెబ్‌సైట్‌లో రూ. 79,999 ఉండగా ఇప్పుడు రూ. 30 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని సమాచారం. అలాగే Poco X6 Pro 5G ఈ సేల్‌లో రూ. 20,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే సంస్థ ఇతర స్మార్ట్‌ఫోన్‌ల సేల్ ధరలను ఇంకా వెల్లడించలేదు.

కాగా CMF Phone 1, Nothing Phone 2a, Poco M6 Plus, Vivo T3X, Infinix Note 40 Pro వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లు అతి చౌక ధరలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక ఈ డిస్కౌంట్ కాకుండా.. కస్టమర్‌లు ఎక్స్‌ట్రా బ్యాంక్ ఆఫర్‌లను పొందే అవకాశం కూడా ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందుతారు. ఇది కాకుండా వినియోగదారులు Flipkart UPI ట్రాన్సక్షన్లపై రూ.40 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ చెల్లింపు ఆప్సన్ ద్వారా కస్టమర్లు రూ. 1 లక్ష వరకు క్రెడిట్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు నో-కాస్ట్ EMI ఆప్సన్‌లు సైతం అందుబాటులో ఉండనున్నాయి.

Related News

WhatsApp Scam: వాట్సాప్ నయా స్కామ్, షేర్ చేశారో అకౌంట్ ఖాళీ అవ్వడం పక్కా!

POCO M7 Plus 5G vs Vivo T4x 5G: పోకో, వివో ఫోన్ల గట్టి పోటీ.. ₹17,000 లోపు ధరలో ఏది బెస్ట్?

iPhone 14 Discount: ఐఫోన్ 14పై షాకింగ్ డిస్కౌంట్.. రూ.30000 వరకు తగ్గింపు!

Lava AMOLED 2 vs Moto G45 vs iQOO Z10 Lite: రూ.15000 బడ్జెట్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలంటే?

Pixel 9 Pro Fold Discount: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.43,000 తగ్గింపు..

HTC Vive Eagle Glasses: వాయిస్ కంట్రోల్‌తో వీడియో, ఫొటోలు తీసే ఏఐ గ్లాసెస్.. హెచ్‌టిసి వైవ్ ఈగల్ లాంచ్

Big Stories

×