Hyderabad: హైదరాబాద్ మీర్‌చౌక్‌లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. పంజేషా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక.. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా.. సయ్యద్ షబ్బీర్ అలీ అనే ఆటో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. మీ నాన్నే ఆటో పంపిచాడంటూ నమ్మించాడు. దీంతో బాలిక ఆటో ఎక్కింది. మలక్‌పేట వైపుగా తీసుకొని వెళ్తుండగా బాలికకు అనుమానం వచ్చి రన్నింగ్ ఆటో నుంచి బయటికి దూకింది. ఇది గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి.. మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.