E-Paper
Advertisement

చేయి ఊపితే చాలు ఆన్ అయిపోయే చిమ్నీలు! ఇండియన్ కిచెన్స్‌కు ఇవి పర్ఫెక్ట్!

చేయి ఊపితే చాలు ఆన్ అయిపోయే చిమ్నీలు! ఇండియన్ కిచెన్స్‌కు ఇవి పర్ఫెక్ట్!
Advertisement

Modular Kitchen Chimney: ప్రస్తుత కాలంలో మోడ్యులర్ కిచెన్‌ అనగానే.. ముందుగా గుర్తుకు వచ్చేది కిచెన్ చిమ్నీ. ఒకప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇప్పుడు ప్రతి ఇంటా ఇదొక మోస్ట్ వాంటెడ్ హోమ్ అప్లయన్స్‌గా మారి పోయింది. ఇండియన్ స్టైల్ వంటకాల్లో తాలింపులు, డీప్ ఫ్రైలు కామన్. దీని వల్ల గోడలు జిడ్డు పట్టడం, పొగతో కళ్ళు మంట పుట్టడం జరుగుతుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి మార్కెట్లో అనేక రకాల ట్రెండింగ్ చిమ్నీలు అందుబాటులో ఉన్నాయి. ఏ ఏ మోడల్స్ ఎలాంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఇంతకీ వాటి ధరలు ఎంత ఉంటాయి అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎంట్రీ-లెవల్ వాల్-మౌంట్ చిమ్నీలు (రూ. 6,000 నుంచి రూ. 10,000):

మీది చిన్న కిచెన్ అయితే , బడ్జెట్ తక్కువగా ఉంటే ఈ మోడల్స్ చక్కగా సరిపోతాయి. మార్కెట్లో లభించే బేసిక్ మోడల్స్ రూ. 6,500 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధారణ పుష్-బటన్ కంట్రోల్స్ , సక్షన్ పవర్‌తో వస్తాయి.

2.వాల్యూ ఆటో-క్లీన్ చిమ్నీలు (రూ.11,000 నుంచి రూ.18,000):

Advertisement

ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్కువగా కొనే రేంజ్ ఇదే. ప్రముఖ బ్రాండ్లకు చెందిన మోడల్స్ రూ.12,000 నుంచి రూ.16,000 మధ్య లభిస్తాయి. ఆటో-క్లీన్ టెక్నాలజీ ఉండటం వల్ల జిడ్డును శుభ్రం చేసే టెన్షన్ ఉండదు. టచ్ కంట్రోల్స్ ,మోషన్ సెన్సార్లు దీని ప్రత్యేకత. తక్కువ ధరలో ఇవి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటాయి. కాబట్టి వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

3.మిడ్-రేంజ్ & ప్రీమియం మోడల్స్ (రూ.18,000 నుంచి రూ.35,000):

పెద్ద కిచెన్‌లు, ఓపెన్ కిచెన్‌ల కోసం ఇవి పర్ఫెక్ట్. తక్కువ సౌండ్ చేసే BLDC మోటార్లు, పవర్ ఫుల్ సక్షన్ పవర్‌తో ఇవి లభిస్తాయి.

Advertisement

Also Read: ఆడవాళ్ల మనసు దోచే టైటాన్ వాచ్‌లపై..30% డిస్కౌంట్!

కొనేటప్పుడు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు:

సక్షన్ పవర్ : ఇండియన్ వంటకాలకు కనీసం 1200 నుంచి 1400 CMH శక్తి గల చిమ్నీ అవసరం అవుతుంది. అప్పుడే పొగ త్వరగా బయటకు వెళ్తుంది.

సైజు: మీ స్టవ్‌ సైజును బట్టి దీన్ని ఎంచుకోవాలి. 2 లేదా 3 బర్నర్లు ఉంటే 60 సెం.మీ చిమ్నీ, అంతకంటే.. పెద్ద స్టవ్ అయితే 90 సెం.మీ చిమ్నీ సరైంది.

ఆటో-క్లీన్ టెక్నాలజీ : మ్యాన్యువల్ క్లీనింగ్ కష్టం కాబట్టి, ఆటో-క్లీన్ ఫీచర్ ఉన్న మోడల్స్‌ను ఎంచుకోవడం బెస్ట్. ఇది నూనెను ఆటో మేటిక్‌గా కలెక్టింగ్ ట్రేలోకి పంపిస్తుంది.

జెస్టర్ / మోషన్ సెన్సార్ : వంట చేసేటప్పుడు చేతులు తడిగా.. లేదా నూనెతో ఉంటాయి. గాలిలో చిన్నగా చేయి ఊపితే చాలు చిమ్నీ ఆన్/ఆఫ్ అయ్యే మోషన్ సెన్సార్ టెక్నాలజీ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది.

ఎలికా, ఫాబర్, గ్లెన్ వంటి ప్రముఖ సంస్థలు బడ్జెట్ ధరల నుంచి ప్రీమియం రేంజ్ వరకు అద్భుతమైన ఫీచర్లతో.. చిమ్నీలను అందిస్తున్నాయి. మీ కిచెన్ డిజైన్ , బడ్జెట్‌కు తగిన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా మీ వంట గదిని పొగ లేకుండా, సరి కొత్త లుక్‌తో మెరిపించవచ్చు!

Related News

48MP కెమెరా, A19 చిప్‌ కలిగిన iPhone 17eపై భారీ తగ్గింపు.. ఈ డీల్ మిస్ కావద్దు మామా!

స్పామ్ కాల్స్, రోబో కాల్స్‌కు చెక్ పెట్టేలా TRAI మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ తప్పు చేస్తే అంతే సంగతులు!

రూ.36,000 లోపు ఏఐ టెక్నాలజీతో సూపర్ ల్యాప్‌టాప్ లాంచ్.. ఫీచర్స్ అదిరిపోయాయ్!

యాపిల్‌కి చెక్ పెట్టిన శాంసంగ్ ఫోల్డబుల్.. అమ్మకాల్లో దూసుకుపోతున్న Galaxy Z Fold 8!

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. 15, 16 మోడళ్లను కొనేముందు ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు!

రీఛార్జ్ బాదుడుకి చెక్.. కేంద్రం సంచలన నిర్ణయం.. దెబ్బకు దిగిరానున్న ప్లాన్ల ధరలు!

Jio, Vi యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే బుక్ చేసుకోండి!

Big Stories

Advertisement
×