E-Paper
Advertisement

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు
Advertisement

Bose New Earbuds: ప్రముఖ బోస్ తమ ఓపెన్ ఇయర్‌బ‌డ్స్ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో Sport Open Earbudsను రన్నింగ్, వర్కౌట్స్, ఇతర అవుట్‌డోర్ యాక్టివిటీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించగా.. Ultra Open Earbuds 2nd Genలో మెరుగైన సౌండ్, క్లియర్ కాల్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో పాటు కొత్త సినిమా మోడ్‌ను అందించింది. చెవిలోపల పెట్టుకునే సాధారణ ఇయర్‌బ‌డ్స్‌కు భిన్నంగా, చెవి బయట భాగానికి కఫ్‌లా ఫిట్ అయ్యే ఓపెన్ డిజైన్‌ను ఈ రెండు మోడళ్లు కొనసాగిస్తున్నాయి. దీంతో మ్యూజిక్ వింటూనే చుట్టూ ఉన్న పరిసరాల శబ్దాలను కూడా వినే అవకాశం ఉంటుంది.

ధర ఎంతంటే?

స్పోర్ట్ ఓపెన్ ఇయర్‌బ‌డ్స్ ధర రూ.19,000గా, అల్ట్రా ఓపెన్ ఇయర్‌బ‌డ్స్ 2వ జనరేషన్ ధర రూ.28,600గా ఉంది. అమెరికాలో అక్టోబర్ 1 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. సెప్టెంబర్ 19 నుంచి ప్రీ-ఆర్డర్లు అందుబాటులో ఉంటాయి. స్పోర్ట్ మోడల్ బ్లాక్, వైట్ స్మోక్, యూకలిప్టస్ గ్రీన్ రంగుల్లో వస్తుంది. అల్ట్రా మోడల్ బ్లాక్, వైట్ స్మోక్, చెర్రీ చాక్లెట్, ఆలివ్ గ్రీన్, స్కై పింక్ రంగుల్లో లభిస్తుంది. భారత్‌లో ధర, అమ్మకాల వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Also Read: PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

స్పోర్ట్ మోడల్‌లో ఏముంది?

స్పోర్ట్ ఓపెన్ ఇయర్‌బ‌డ్స్‌లో కస్టమ్ డైనమిక్ డ్రైవర్లు, బోస్ ఓపెన్ ఆడియో టెక్నాలజీ ఉన్నాయి. బయట శబ్దం మారినప్పుడు వాల్యూమ్‌ను ఆటోమేటిక్‌గా సర్దే ఆటో వాల్యూమ్ ఫీచర్ కూడా ఉంది. ఫిజికల్ బటన్లతో మ్యూజిక్, కాల్స్, వాల్యూమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. కాల్స్ కోసం స్పీచ్ క్లారిటీ ఫీచర్ ఉంది. చెమట, నీటి చినుకులు, దుమ్మును తట్టుకునేలా IP54 రేటింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్ మరో 22 గంటల బ్యాకప్ ఇస్తుంది.

Ultra Open 2nd Gen ప్రత్యేకతలు:

Advertisement

అల్ట్రా ఓపెన్ ఇయర్‌బ‌డ్స్ 2వ జనరేషన్‌లో కొత్త డ్రైవర్‌ను వాడారు. దీంతో బాస్, వాల్యూమ్ మెరుగయ్యాయని కంపెనీ చెబుతోంది. ఇందులో ఆటో వాల్యూమ్, స్పీచ్ క్లారిటీతో పాటు ట్రూస్పేషియల్ ఆధారిత సినిమా మోడ్ ఉంది. వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు చూస్తున్నప్పుడు సౌండ్‌ను మరింత విస్తృతంగా వినిపిస్తూ, డైలాగ్‌ను స్పష్టంగా ఉంచడం దీని ఉద్దేశం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు బ్యాటరీ వస్తుంది. కేస్‌తో కలిపి మరో 19.5 గంటల బ్యాకప్ లభిస్తుంది.

భారత్‌లోకి ఎప్పుడంటే?

రెండు మోడళ్లలో బ్లూటూత్ 5.4, రెండు డివైస్‌ల మల్టీపాయింట్ కనెక్షన్, SBC, AAC కోడెక్స్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఉన్నాయి. అల్ట్రా మోడల్‌లో అనుకూలమైన ఆండ్రాయిడ్ ఫోన్లతో స్నాప్‌డ్రాగన్ సౌండ్, aptX అడాప్టివ్ సపోర్ట్ కూడా ఉంది. చెవి లోపల పెట్టుకోకుండా సంగీతం వినాలనుకునే వారికి ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బయట నడుస్తూ లేదా వ్యాయామం చేస్తూ పరిసరాల శబ్దాలు కూడా వినిపించాలనుకునేవారికి ఓపెన్ ఇయర్ విధానం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే భారత్‌లో లాంచ్ తేదీ, అధికారిక ధర ప్రకటించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read: లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

Tags

Related News

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×