BigTV English

Samsung Galaxy F55 5G Mobile: అదిరిపోయే డిజైన్‌తో సామ్‌సంగ్ 5G ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Samsung Galaxy F55 5G Mobile: అదిరిపోయే డిజైన్‌తో సామ్‌సంగ్ 5G ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Samsung Galaxy F55 5G Mobile Design: దేశంలో 5G నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. 5G మొబైల్స్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కంపెనీ 5G ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో ఒకటైన సామ్‌సంగ్ కొత్త ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. తన బ్రాండ్ నుంచి Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ఇప్పటికే లైవ్ అవుతుంది.


సామ్‌సంగ్ ఈ కొత్త ఫోన్‌ను 2024 కోసం ప్రత్యేకరంగా డిజైన్ చేసింది. ఫోన్ చాలా స్లిమ్‌గా అట్రాక్ట్ డిజన్‌తో త్వరలో లాంచ్ చేయబడుతుంది. ఈ సెగ్మెంట్‌లోని అత్యంత పలుచని Vide లెదర్ డిజైన్‌తో Galaxy F55 5G ఫోన్ చూడొచ్చు. సామ్‌సంగ్ లెథరెట్‌తో కూడిన సన్నని ఫోన్‌గా ఈ వేరియంట్‌ను తీసుకువస్తోంది. శాడిల్ స్టిచ్ ప్యాటర్న్‌తో ఈ సామ్‌సంగ్ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేక డిజైన్, రూపానికి సంబంధించి ఇది ఒక ఖచ్చితమైన మాస్టర్ పీస్ అని కంపెనీ పేర్కొంది.

ఫోన్‌ని చేతిలో పట్టుకోవడం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ప్రత్యేక డిజైన్‌తో ఈ సామ్‌సంగ్ ఫోన్ బరువు తక్కువగా ఉండేలా ప్రయత్నం కూడా జరిగింది. ఫోన్‌ను టీజ్ చేస్తున్నప్పుడు నిమిషాల నుండి గంటల వరకు ఉపయోగించడం వల్ల మీరు బరువును ఫీల్ అవరని కంపెనీ తెలిపింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.


Also Read: మతిపోగొడుతున్న మోటో కొత్త మడత ఫోన్.. స్క్రీన్ ఎంత స్టైలిష్‌గా ఉందంటే?

కంపెనీ Galaxy F55 5Gని రెండు కలర్ ఆప్షన్లలో తీసుకువస్తోంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ అరికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ కలర్‌లలో మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంటుంది. అంతేకాకుండా LED ఫ్లాష్ లైట్‌ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

Also Read: iQOO Neo 9s Pro launch : ఐక్యూ నుంచి మూడు కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు అదుర్స్!

ఇది 12GB వరకు RAM+256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను పొందుతుంది. ఇది ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంటుంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×