Big Stories

Smart Bandage : స్మార్ట్ టెక్నాలజీ సాయంతో గాయం నయం..

Smart Bandage : ఒక చిన్న గాయాం చాలు.. దాని నుండే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ శరీరంలోకి ప్రవేశించడానికి. ఇక ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే చిన్న గాయాన్ని కూడా వెంటనే నయం చేసుకోవడం ముఖ్యమని వైద్యులు చెప్తుంటారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు చేతికి చిన్న కట్ అయితే.. వెంటనే బ్యాండేజ్ వేసుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ ఈ బ్యాండేజ్.. ఆ గాయాన్ని ఎంత తొందరగా నయం చేస్తుంది అన్నదే పాయింట్. దానికోసమే స్మార్ట్ బ్యాండేజ్‌ల తయారీ ఊపందుకుంది.

- Advertisement -

కొన్ని గాయాలు అంత తొందరగా మానిపోయేవి కావు. దానికోసమే యాంటీబయాటిక్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్యాండేజెస్‌తో కూడా ఇలాంటి గాయాలకు తగిన చికిత్స అందుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటికోసమే ప్రత్యేకమైన స్మార్ట్ బ్యాండేజెస్ తయారీని మొదలుపెట్టారు. ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో స్మార్ట్ బ్యాండేజ్ అనేది మెడికల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇవి పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలా యూకే, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కలిసి వీటిని తయారు చేశారు.

- Advertisement -

క్యాన్సర్, డయాబెటీస్, రక్తనాళాల సమస్యలు ఉన్నవారిలో చిన్న గాయం తగిలినా.. అది మానిపోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి వారికి స్మార్ట్ బ్యాండేజెస్ అనేవి మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ దీని వల్ల పలు సమస్యలు కూడా ఉంటాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌బగ్స్ లాంటి బ్యాక్టీరియా పెరగడానికి ఈ స్మార్ట్ బ్యాండేజ్‌లు కారణమవుతాయని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రులలో పెరుగుతున్న సూపర్‌బగ్స్‌ను కంట్రోల్ చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

స్మార్ట్ బ్యాండేజ్‌లు తయారు చేసిన శాస్త్రవేత్తలు మాత్రం సూపర్‌బగ్ తయారీకి కారణమయ్యే బ్యాక్టీరియాను స్మార్ట్ బ్యాండేజెస్ కంట్రోల్ చేస్తాయని చెప్తున్నారు. స్మార్ట్ బ్యాండేజెస్ అనేవి వైర్‌లెస్ పవర్‌ఫుల్ డెలివరీ సిస్టమ్‌గా పనిచేస్తాయని వారు వెల్లడించారు. చికిత్స వరకు వెళ్లకుండానే ఎన్నో గాయాలను స్మార్ట్ బ్యాండేజెస్ నయం చేసేస్తాయని వారు తెలిపారు. త్వరలోనే మరెన్నో ఇతర దేశాలతో కలిసి మరింత మెరుగ్గా ఈ స్మార్ట్ బ్యాండేజెస్ తయారీని చేపడతాయని యూకే, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ స్మార్ట్ బ్యాండేజెస్ అనేవి వైద్యులు అవసరం లేకుండా పేషెంట్‌ను మానిటర్ చేస్తాయని బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News